Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో రెండో దశ భూ సమీకరణ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. తొలి రోజు వడ్డమాను, యండ్రాయి గ్రామాల్లో భూ సమీకరణ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొంటారు. రెండో విడత భూ సమీకరణకు సంబంధించి సీఆర్డీఏ (CRDA) అధికారులు నేటి నుంచి రైతులను కలిసి అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. భూ సమీకరణ వల్ల భూములు ఇచ్చిన రైతులకు ఎంత మేర ప్రయోజనం కలుగుతుందనే అంశంపై గ్రామ సభల ద్వారా అధికారులు వివరించనున్నారు. అలాగే, రెండో దశలో భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సీఆర్డీఏ విజ్ఞప్తి చేసింది.
Read Also: Joe Root Mission 15921: మిషన్ 15921.. జో రూట్ రోడ్ మ్యాప్, 2027లో సచిన్ రికార్డు బ్రేక్!
అయితే, రెండో దశ భూ సమీకరణలో భాగంగా మొత్తం 3,828.56 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. తుళ్లూరు మండలంలోని పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రాపురం గ్రామాలు ఉండగా.. అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి లేమల్లె గ్రామాలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో రైతులు ఇప్పటికే భూములు ఇస్తామని చెప్పి వారి భూముల పట్టాలను అధికారులకు అందజేశారు.
Read Also: Russia: వెనిజులాలో ఉద్రిక్తతలు.. యూఎస్ నుంచి చమురు నౌకలను రక్షించడానికి రష్యా జలాంతర్గామి ఎంట్రీ!
ఇక, తుళ్లూరు మండలంలోని వడ్డమానులో 1763.29 ఎకరాల పట్టా భూమి, 4.72 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ సమీకరణ చేపట్టనుంది. హరిశ్చంద్రాపురంలో 1448.09 ఎకరాల పట్టా, 2.29 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ సమీకరణ చేయనున్నారు. పెదపరిమిలో 5886.18 ఎకరాల పట్టా భూమి ఉంది. అలాగే, అమరావతి మండలలోని వైకుంఠపురంలో 1965 ఎకరాలు, పెదమద్దూరులో 1018 ఎకరాల పట్టా భూములు, యండ్రాయ్ గ్రామ పరిధిలో 1879 ఎకరాల పట్టా భూమి, 46 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ భూ సమీకరణ చేయనున్నారు. ఇక, కర్లపూడి లేమల్లే 2603 ఎకరాలు పట్టా భూమి, 51 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ను భూ సమీకరణలో చేస్తుంది.
Read Also: Tragedy: తుఫాన్ ను ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరు యువకులు మృతి.. మరో 9 మందికి గాయాలు
కాగా, మొత్తం 7 గ్రామాల్లో 16,562.52 ఎకరాల పట్టా భూములు, అలాగే 104.01 ఎకరాల అసైన్డ్ భూములు సమీకరించాలని సీఆర్డీఏ కమిషనర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ భూమి కలిపి చూస్తే భూ సమీకరణ తర్వాత మొత్తం 20,494 ఎకరాల భూమి అమరావతి అభివృద్ధికి అందుబాటులోకి రానుంది. దీంతో రైల్వే లైన్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం 7 గ్రామాల్లో భూ సమీకరణ చేయనున్నారు సీఆర్డీయే అధికారులు. ఉదయం 10 గంటలకు వడ్డమాను, సాయంత్రం 4 గంటలకు ఎండ్రాయిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మంత్రి నారాయణ ప్రారంభించనున్నారు.