Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.. ఇక, రాజధాని పరిధిలోకి గ్రామాలను డెవలప్ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించేందుకు సీఆర్డీఏ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే మంజూరైన రూ.904 కోట్లకు అదనంగా మరో రూ.533 కోట్లను కేటాయించడంతో మొత్తం నిధులు రూ.1,437 కోట్లకు చేరాయి.
29 గ్రామాల్లో మౌలిక వసతులకు భారీగా నిధులు
రాజధాని గ్రామాల్లో రహదారులు, ఇతర ప్రాథమిక మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. భవిష్యత్‌లో పెరగనున్న జనాభా, వాహనాల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
Also Read
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
సీసీ రోడ్లకు బదులు బీటీ రోడ్లు
అమరావతిలోని 29 గ్రామాల్లో ప్రస్తుతం ప్రతిపాదించిన సీసీ రోడ్ల స్థానంలో బీటీ రోడ్లు నిర్మించే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని నేల స్వభావం, భవిష్యత్‌లో పెరిగే ట్రాఫిక్‌ను అధ్యయనం చేసిన తర్వాత రోడ్ల నిర్మాణ విధానాన్ని ఖరారు చేయనున్నారు.
ల్యాండ్ పూలింగ్ రైతు కుటుంబాలకు రుణమాఫీ
ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి ఆమోదం లభించింది. దీంతో ల్యాండ్ పూలింగ్ రైతు కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరట లభించే అవకాశం ఉంది.
శాకమూరులో భారీ నిర్మాణాలు
అమరావతిలోని శాకమూరులో రూ.596 కోట్ల అంచనా వ్యయంతో సెంట్రల్ పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, హెచ్ఆర్ భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. రాజధాని అభివృద్ధిలో భాగంగా ఈ నిర్మాణాలను చేపట్టనున్నారు.
హోటళ్లు, స్కూళ్లకు భూముల కేటాయింపులో కొత్త విధానం
రాజధాని ప్రాంతంలో హోటళ్లు, పాఠశాలల వంటి సంస్థలకు అదనపు భూములను కేటాయించేందుకు కొత్త విధానాన్ని తీసుకురానున్నారు. ఇందులో భాగంగా ఎకరాకు కనీసం రూ.10.25 కోట్ల ధరను నిర్ణయించే ప్రతిపాదన ఉంది.
తాడికొండ, కంతేరులో ల్యాండ్ పూలింగ్‌కు ఆమోదం
అమరావతి పరిధిలోని తాడికొండ, కంతేరు ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేపట్టేందుకు కూడా సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఈ ప్రాంతాల్లో భూముల సమీకరణ ప్రక్రియకు మార్గం సుగమమైంది. మొత్తంగా అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు, రహదారులు, ప్రభుత్వ భవనాలు, భూముల కేటాయింపు, ల్యాండ్ పూలింగ్ వంటి అంశాలపై వరుస నిర్ణయాలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజావార్తలు
-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
-
The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
-
Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!