Speaker Ayyannapatrudu: రేపటి నుంచి అసెంబ్లీలో ఏఐ ఆధారిత హాజరు.. స్పష్టం చేసిన స్పీకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speaker Ayyannapatrudu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అయితే, అసెంబ్లీలో రేపటి నుంచి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత హాజరు నమోదు విధానం అమల్లోకి రానుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సభ్యులు తమ కేటాయించిన స్థానాల్లో కూర్చుంటేనే హాజరు నమోదయ్యే విధంగా ఈ వ్యవస్థను రూపొందించామని తెలిపారు. పార్లమెంటులోనూ ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సాంకేతికతను వినియోగించి అసెంబ్లీ కార్యకలాపాలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యమని చెప్పారు.
Read Also: Ambati Rambabu bail: అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్.. మాజీ మంత్రికి మరో కేసులోనూ బెయిల్
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ఈసారి అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లోనే సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్పీకర్ వెల్లడించారు. అలాగే అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలకు ఏప్రిల్ నెలాఖరులో గృహప్రవేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలోనే అత్యుత్తమంగా ఏపీ అసెంబ్లీ భవన నిర్మాణాన్ని ప్రణాళికబద్ధంగా చేపట్టామని స్పీకర్ పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని కొత్త అసెంబ్లీలో 300కు పైగా సభ్యులు కూర్చునేలా సీటింగ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2028 డిసెంబర్ నాటికి కొత్త అసెంబ్లీ భవనం అందుబాటులోకి తీసుకురావాలని నిర్మాణ సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయని స్పష్టం చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు..
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!