Flood Effect: గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో భారీగా వరద ప్రవాహాం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కుంట దగ్గర జాతీయ రహదారిపై వరద నీరు పోటెత్తింది. ఈ వరద దెబ్బకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.