మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో తాను ఉన్న ఒక వీడియో వైరల్ కావడంపై సినీ నటి సుమయా రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆమె డియర్ ఉమా అనే సినిమాను నిర్మిస్తూ హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఆమె భుజం మీద మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేయి వేసి మాట్లాడుతున్న వీడియో వైరల్ అయింది. దీంతో ఒక వర్గం సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి తప్పుగా ప్రచారం చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే తోపుదుర్తి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
Music Director : అనిరుధ్ వేగాన్ని రెహమాన్ తట్టుకోగలడా..
“నమస్తే..
నేను మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రేపటి రోజున రామగిరి మండలానికి శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీకి దురాగతాలపై గొంతు ఎత్తడానికి స్వచ్ఛందంగా వేలాదిగా ప్రజలు తరలివచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండడం జగన్మోహన్ రెడ్డి గారిని రామగిరి మండలం లోనికి రానివ్వకుండా అడ్డుకునే పరిస్థితి కనపడకపోవడంతో నా సమీప బంధువులు నా కుటుంబ సభ్యులు అందర్నీ కూడా నీచపు రాజకీయ క్రీడలో కి లాగుతున్నారు. ఒక వీడియో నేను ఒక ఎయిర్పోర్టులో మా బంధువుల అమ్మాయితో నేను మాట్లాడుతుండగా వీడియో వైరల్ చేసి నీచానికి పాల్పడుతున్నారు. ఎవరైతే ఆ వీడియోని అప్లోడ్ చేస్తారో పోస్ట్లు పెట్టడం జరుగుతుందో ఎవరైతే వైరల్ చేయడం జరుగుతుందో వారందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తూ లీగల్ యాక్షన్ తీసుకోవడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. దాదాపుగా 25 సంవత్సరాల నా రాజకీయ జీవితం లో నేను సంపాదించుకున్న గౌరవ మర్యాదలు ఈ పద్ధతిలో నష్టపరుస్తామనే మీరు ఆలోచన చేస్తే దీన్ని మీ దుర్మార్గమైనటువంటి విష ప్రచారాన్ని నమ్మే పరిస్థితిల్లో ఎవరు లేరు మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నా నిజాయితీ కలిగిన నాయకత్వంతో రాప్తాడు నియోజకవర్గంలో పేదలకు సేవలు అందిస్తున్న నాపై బురద చల్లేటువంటి కార్యక్రమాల వల్ల మీకు ఎటువంటి ఫలితం ఉండదు దానివల్ల మీరు గొప్పవారు కాలేరని తెలుసుకోవాలని కోరుతున్నాం…” అని అంటూ ఆయన రాసుకొచ్చారు.
నమస్తే..🙏🙏
—నేను మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రేపటి రోజున రామగిరి మండలానికి శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీకి దురాగతాలపై గొంతు ఎత్తడానికి స్వచ్ఛందంగా వేలాదిగా ప్రజలు తరలివచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండడం జగన్మోహన్ రెడ్డి గారిని… pic.twitter.com/POoPOKb7hc
— Thopudurthi Prakash Reddy (@ImThopudurthi) April 7, 2025
ఇక సుమాయా రెడ్డి కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె ఆరోపించారు. నిజాలను తెలుసుకోకుండా, ఆధారాలు లేకుండా తన గురించి అసత్య ప్రచారం చేయడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “ఒక ఆడపిల్లపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం చాలా బాధాకరం. నిజం తెలుసుకుని మాట్లాడితే మంచిది” అని సుమయా రెడ్డి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఒక వీడియోను విడుదల చేసి, తన వైపు నుంచి స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ వీడియోలో ఆమె తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ, వాస్తవాలను ప్రజల ముందు ఉంచారు.
“నమస్తే అండి నా పేరు సుమయా, డియర్ ఉమా అనే ఓ సినిమాకు నేను ప్రొడ్యూసర్‌ను.. హీరోయిన్‌ను. ఆ సినిమా ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నా, నేను ఫోన్ ఆన్ చేయగానే.. మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ, నా గురించి ట్రెండింగ్ అవుతోందని కాల్స్ చేశారు. ఎంత టెన్షన్ క్రియేట్ చేసిందంటే.. నేను ఏమైందని షాకయ్యా, తీరా చూస్తే అది ఎయిపోర్ట్ వీడియో. వాళ్లకు నచ్చినట్లు కామెంట్స్ చేసుకుని పోస్ట్ చేస్తున్నారు. ఒక అమ్మాయిని పట్టుకుని ఇలా తప్పుడు ప్రచారం చేశారు. నిజానిజాలు తెలియకుండా ఇలా చేయడం సరికాదు. రాజకీయం చేయొచ్చు కానీ.. ఒక అమ్మాయిని అడ్డంపెట్టుకుని రాజకీయం చేయకండి. అదే నా పక్క సీట్లో వేరేవాళ్లు ఉండుంటే.. మీకు పడనివారు ఎవరున్నా ఇలాగే రాస్తారా.. ఒక మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా.. చాలా బాధగా ఉంది. నాకు మాటలు కూడా రావడం లేదు.. అందులో నిజం లేదు. మా ఫ్యామిలీ ఫోటోలు.. నేను అనంతపురం అమ్మాయిని.. మాకు చుట్టరికం ఉంటుంది, మాట్లాడాకుంటాం, ఇంటికి వెళ్లడం, వాళ్లు రావడం, నేను వెళ్లడం.. దాన్ని కూడా ఇలా చేస్తున్నారంటే దీన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదు. ప్లీజ్ నెగిటివ్ ప్రచారం చేయొద్దు.. మహిళల్ని గౌరవించండి.. నిజం ఉంటే మాట్లాడండి అంటూ వీడియో విడుదల చేశారు. సుమయా రెడ్డి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విషయాన్ని నమ్మకుండా, నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని కోరారు.