Parakamani Case: పరకామణి చోరీపై నిందితుడు రవి కుమార్ మొదటిసారిగా క్లారిటీ ఇచ్చాడు. జీయ్యంగారి గుమస్తాగా విధులు నిర్వహిస్తూ, కేబుల్ ఆపరేటర్ గా కొనసాగుతూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూన్నాను.. 2023 ఏప్రిల్ 29వ తేదీన పరకామణిలో తప్పు చేశాను.. చేసిన తప్పుకు కుటుంబమంతా బాధపడ్డాం.. ప్రాయశ్చిత్తంగా 90 శాతం ఆస్తిని దేవుడికి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. నా ఆస్తిని టీటీడీకి ఇచ్చిన తరువాత నన్ను కొంత మంది బ్లాక్ మెయిల్ చేశారు.. నాపై అవాస్తవాలు ప్రచారం చేశారని రవి కుమార్ పేర్కొన్నారు.
అయితే, నా బాడీలో సర్జరీలు చేసుకుని.. కొంత మందికి ఆస్తులు ఇచ్చాను అని రవి కుమార్ తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం నేను ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నాను.. నా ఆస్తిని దేవుడికి ఇస్తే.. ఇతరులకు ఎందుకు లాంచాలు ఇస్తారు అని ప్రశ్నించారు. అయితే, నన్ను, నా కుటుంబాన్ని వేధింపులకు గురి చేయకండి.. ఇప్పటికే చేసిన తప్పుకు కుటుంబమంతా మనోవేదనకు గురవుతున్నామని నిందితుడు రవి కుమార్ చెప్పుకొచ్చాడు.