Tirumala: శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఆరాటపడే భక్తులు ఎందరో. కలియుగ దైవం అని కాలి నడకన తిరుమల చేరి ఆ ఏడుకొండలవాడిని దర్శిస్తే భాధలు తొలిగి సకల శుభాలు కలుగునని భక్తులు కాలి నడకన శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. కానీ గత కొంత కాలంగా తిరుమల కాలిడకన వెళ్ళాలి అనుకునే భక్తులని భయపెడుతున్న విషయం వన్య ప్రాణుల సంచారం. తిరుమల గిరుల పైన గత కొంత కాలంగా వన్య ప్రాణులు సంచరిస్తూ ప్రజలని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికి తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 5 పులులను పట్టుకున్న అధికారులు కాలి నడకన తిరుమల చేరే భక్తులు చిరుతల గురించి భయపడాల్సిన పనిలేదు అనిభరోసా ఇచ్చారు.
Read also:Crime: గిరిజన మహిళపై BSF సైనికులు సామూహిక అత్యాచారం.. భద్రతా బలగాలపై నక్సలైట్ల ఆరోపణలు
అయితే తాజాగా తిరుమలలో ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించారు సెక్యూరిటీ సిబ్బంది. వివరాలలోకి వెళ్తే.. నిన్న రాత్రి 12:30 గంటల సమయంలో అలిపిరి నడక మార్గంలోని నరసింహ స్వామి ఆలయం వద్ద ఫుట్ పాత్ పై ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. చాల సమయం వరకు ఎలుగు బంటి నడక మార్గంలోనే ఉన్నది. కాగా ఆ సమయంలో భక్తుల సంచారం లేదు. డిఏఫ్ఓ చంద్రశేఖర్ ఈ ఘటన పైన స్పందిస్తూ 11:45 గంటకి లాస్ట్ బ్యాచ్ భక్తులు తిరుమల చేరుకున్నారు. కాగా 12:30 గంటలకి ఎలుగుబంటి సంచరించింది. తిరుమల గిరులపైన వన్య ప్రాణుల సంచారం సర్వసాధారణం అని వెల్లడించిన ఆయన భక్తుల భద్రత దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసాం అని పేర్కొన్నారు.