GST on Idli and Dosa: దక్షిణ భారతీయులు ఎక్కువగా తినే అల్పాహారం ఇడ్లీ, దోశలపై 5 శాతం జీఎస్టీ విధించడంపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తినే చపాతీ, పరోటాలా మీద ఉన్న 18 శాతం జీఎస్టీని జీరో చేయడంపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్ర ప్రజల మీద వివక్ష చూపించడానికి జీఎస్టీ పన్నులు కారణం అవుతున్నాయని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇలా ఎందుకు చేశారని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాది ప్రజలు ఎక్కువగా చపాతీ, పరోటా తింటారు కాబట్టి వారు తినే టిఫిన్ల మీద GST తగ్గించి.. దక్షిణాది వారి అల్పాహారంగా ఎక్కువ మంది తినే ఇడ్లీ, దోశల మీద జీఎస్టీ పెంచడం తగునా అని ప్రశ్నిస్తున్నారు. అయితే, దోశలపై విధించిన జీఎస్టీ పన్ను ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని ప్రజల జీవనశైలి, ఆహార అలవాట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇది పన్ను విధానంలో అసమానతలకు దారి తీస్తుందని నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.