3 Biharis Cheated Panipuri People In The Name Of Exchange Of 2000 Notes: ఈరోజుల్లో దొంగలు చాలా తెలివి మీరారు. ఇంతకుముందులాగా ముసుగు కప్పుకొని దాడులు చేయకుండా.. ట్రెండ్‌కి తగిన వ్యూహాలు రచిస్తూ, దోపిడీలకు పాల్పడుతున్నారు. మాయమాటలు చెప్పి, జనాల్ని బురిడీ కొట్టిస్తూ, లక్షలకు లక్షలు దోచేస్తున్నారు. ఫలానా పని కచ్ఛితంగా చేస్తామని బలంగా నమ్మించి, జనాలకు శఠగోపాలు పెడుతున్నారు. తాజాగా బీహార్‌కు చెందిన ముగ్గురు దొంగలు కూడా.. రూ.2000 నోట్ల మార్పిడి పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. ఏకంగా రూ.18 లక్షలు తీసుకుని పారిపోయారు. ఈ ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Pakistan: పాకిస్థాన్‌లో కుండపోత.. 86 మంది మృతి, 151 మందికి గాయాలు
కేంద్ర ప్రభుత్వం రూ.2000 నోట్లను రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో.. ఆ నోటుకి మార్కెట్‌లో ఇప్పుడు పెద్దగా విలువ లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఈ నోట్లను మార్చుకుంటున్నారు జనాలు. అయితే.. బీహార్‌కి చెందిన ముగ్గురు వ్యక్తులు మాత్రం, ఒక పెద్ద ప్లాన్ వేశారు. తమకు రూ.6 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే.. రూ.18 లక్షల విలువగల రూ. 2000 నోట్లను ఇస్తామని నమ్మబలికారు. అంటే.. ఒకటికి మూడింతల లాభం ఇస్తామని పానీపూరి నిర్వాహకుల్ని నమ్మించారు. దీంతో.. వాళ్లు టెంప్ట్ అయ్యారు. రెండు వేల నోట్ల మార్పిడికి ఇంకా సమయం ఉంది కాబట్టి, ఈ ఆఫర్‌తో తాము లక్షాధికారులం అవుతామని భావించి, ఈ డీల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Article 370: ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ప్రశాంతం.. సుప్రీంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు
డీల్ ప్రకారం.. పానీపూరి నిర్వాహకులు ఆ కేటుగాళ్లకు రూ.6 లక్షల విలువగల రూ.500 నోట్లను ఇచ్చారు. వాళ్లు ఒక బ్యాగ్ ఇచ్చి, అక్కడి నుంచి వెంటనే ఉడాయించారు. బాధితులు ఆ కేటుగాళ్లు ఇచ్చిన బ్యాగ్ ఓపెన్ చేయగా.. అందులో చిత్తు కాగితాలు ఉండటాన్ని గమనించారు. పైన నిజంగానే నోట్లు ఉన్నట్లు ఫేక్ నోట్లు పెట్టి, లోపల చిత్తుకాగితాలు కుక్కారు. దీంతో.. తాము మోసపోయామని భావించిన బాధితులు, వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల్ని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు.