నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. దగ్గు జలుబుతో ఆసుపత్రికి చేరిన వారికి కరోనా టెస్టులు చేయడంతో ఒకేసారి 6 కేసులు బయటపడ్డాయి. కరుణ లక్షణాలు తక్కువగా ఉండడంతో ఐదుగురిని హోమ్ ఐసోలేషన్ పంపిన వైద్యులు.. మరో ఒకరికి నెల్లూరులోని కరోనా వార్డులో చికిత్స అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,440 కోవిడ్ పాజివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక, మరోసారి విశాఖపట్నంలో రికార్డు స్థాయిలో రోజువారి కేసులు నమోదు అయ్యాయి.. కోవిడ్ కేసుల నమోదులో మళ్లీ టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోయింది వైజాగ్.. వరుసగా నాలుగో రోజు కూడా పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేలకు పైగానే వెలుగు చూశాయి.. గడిచిన 24 గంటల్లో 2,258 పాజిటివ్ కేసులు నమోదు కాగా..…
కరోనా థర్డ్‌వేవ్ విరుచుకుపడుతోంది.. దేశవ్యాప్తంగానే కాదు.. రాష్ట్రంలోనూ కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.. ఇక, స్కూళ్లపై పంజా విసురుతోంది మహమ్మారి.. ప్రకాశం జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది.. తాజాగా 54 మంది ఉపాధ్యాయులు, 18 మంది విద్యార్థులు, నలుగురు నాన్ టీచింగ్ స్టాఫ్ కు కరోనా పొజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. ముఖ్యంగా సంక్రాంతి సెలవుల తర్వాత అమాంతం కొత్త కేసులు పెరుగుతూ పోతున్నాయి.. గత ఐదు రోజుల్లో ప్రకాశం జిల్లాలోని స్కూళ్లలో 147 మందికి…
మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి.. వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో కరోనా కలకలం సృష్టిస్తోంది.. ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. నిట్‌లో చదువుతున్న నలుగురు విద్యార్థులు, మరో ఫ్యాకల్టీకి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది.. దీంతో అప్రమత్తమైన నిట్ అధికారులు.. ఈ నెల 16వ తేదీ వరకు కళాశాలకు సెలవులు ప్రకటిస్తూ నిట్ డైరెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు… Read Also: ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం..! నేడు…
పోలీసు శాఖలో మళ్లీ కరోనా మహమ్మారి కేసులు కలకలం సృష్టిస్తున్నాయి… రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నా పలువురు పోలీసు సిబ్బందికి కరోనా సోకుతుంది… హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో పోలీసులు కరోనాబారినపడ్డారు… వరుస ఉత్సవాలు, బందోబస్తులు , నిరసనలు, ఆందోళనలతో పోలీసు శాఖను కరోనా మహమ్మారి వణికిస్తోంది… ఇప్పటికే పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సిన్ వేశారు.. అయితే, ఆందోళనలు ముట్టడి కార్యక్రమాలు ఉంటుండడంతో పోలీసులకు కరోనా టెన్షన్ వెంటాడుతోంది… గత నాలుగు రోజుల నుండి రాష్ట్రంలో…