హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న ఆయన… మొదటగా కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్‌తో సమావేశమయ్యారు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర అంశాలపై చర్చించారు.. ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లో భేటీ అయ్యారు.. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు ఏపీ సీఎం.. కాగా, ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న సీఎం వైఎస్ జగన్… శుక్రవారం రోజు తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు.