Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Analysis Will The Situation In Congress Change With Pk Entry

Congress : పీకే ఎంట్రీతో కాంగ్రెస్‌ రాత మారుతుందా..!

Published Date :April 16, 2022 , 9:29 pm
By Gogikar Sai Krishna
Congress : పీకే ఎంట్రీతో కాంగ్రెస్‌ రాత మారుతుందా..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ ఇప్పుడు మునుపు ఎన్నడూ లేని విధంగా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకు దేశంలో జరిగిన 49 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ 39 ఎన్నికల్లో ఓటమి పాలైంది. అలాగే, సార్వత్రిక ఎన్నికలలో కూడా హస్తం పార్టీ ప్రదర్శన అధ్వాన్నంగా ఉంది. 2014లో 44 సీట్లు, 2019లో 52 స్థానాలు మాత్రమే గెలవటం ఆ పార్టీ దుస్థితికి నిదర్శనం.

దేశంలోని మొత్తం 545 లోక్‌సభ స్థానాలలో దాదాపు 200 చోట్ల బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ముఖా ముఖి పోరు ఉంటుంది. ఈ స్థానాలలో కాంగ్రెస్‌ను బీజేపీ సునాయాసంగా ఓడించగలుగుతోంది. బీజేపీని ధీటుగా ఎదుర్కోవటంలో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలమవుతోంది. కారణాలను విశ్లేషించుకుని పార్టీ తిరిగి పుంజుకునేలా చేయాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉంది. కానీ కాంగ్రెస్‌ నాయకత్వం ఎన్నికల వేళ మాత్రమే హడావుడి చేస్తుంది. మిగతా సమయంలో గాంధీలు అటువైపు చూడదు. బీజేపీ విషయం అలా కాదు. నాయకత్వం నిరంతరం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటుంది. ఎన్నికలకు చాలా కాలం ముందే వ్యూహ రచన చేసి దానిని అమలుచేసే పనిలో ఉంటుంది. గెలవటానికి ఏం చేయాలో అది చేస్తుంది. అందుకే బీజేపీ ముందు కాంగ్రెస్‌ తేలిపోతోంది.

Also Read

  • Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
  • Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
  • love Or Attraction: లవ్‌లో పడిపోయారా..? అది ఆకర్షణ..? లేక ప్రేమేనా..?
  • Valentine's Day: వాలెంటైన్ ఎవరు..? ప్రేమికుల దినోత్సవం ఎలా ప్రారంభమైంది..?

పార్టీ బలహీనమయ్యే కొద్దీ అసమ్మతి స్వరం పెరగుతోంది. నిన్న మొన్నటి వరకు సోనియా దయతో అధికార పదువులు అనుభవింని వారు ఇప్పుడు ఆమె పట్ల ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. గాంధీల ప్రజాకర్షణ శక్తి తగ్గితే తగ్గ వచ్చు .కానీ ఇప్పటికీ ఆ పార్టీ ముక్కలు కాకుండా ఈ మాత్రమైనా ఒక్కటిగా ఉందంటే గాంధీలే కారణం. అయితే అసమ్మతి నేతల వాదనను కూడా కొట్టిపారేయలేం.

2019 నుంచి పార్టీ అధ్యక్ష పోస్ట్‌ ఖాలీగా ఉంది. సోనియాతాత్కాలిక అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. కానీ, నిర్ణయాలన్నీ రాహుల్‌ గాంధీ తీసుకుంటున్నారు. ఆయన ఏ హోదాలో పార్టీ అత్యున్నత నిర్ణయాలు తీసుకుంటున్నారని కపిల్‌ సిబల్‌ వంటి వారుప్రశ్నిస్తున్నారు. పార్టీలో సంస్కరణల కోసం వారు డిమాండ్ చేస్తున్నారు. ఐతే, అధినేత్రి వారి డిమాండ్లను పట్టించుకోలేదు. కానీ, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాభవంతో సోనియా తీరు మారింది. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆమె సీనియర్లు చెప్పేది కూడా వింటున్నారు. ఎలాగూ వచ్చే ఆగస్టులో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ నూతన అధ్యక్షడు ఎవరో మారో నాలుగు నెలలలో తేలిపోతుంది.

ఇదిలావుంటే.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో శనివారం పార్టీ సీనియర్ నేతలు సమావేశమై నాలుగు గంటల పాటు చర్చించారు. రాహుల్‌గాంధీతో పాటు అంబికా సోనీ, దిగ్విజయ్‌ సింగ్, మల్లిఖార్జున ఖర్గే, అజయ్ మాకెన్‌, కె.సి.వేణుగోపాల్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఈ సామావేశానికి హాజరవటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రశాంత్‌ కిశోర్‌ ఈ భేటీ సందర్భంగా 2024 ఎన్నికల వ్యూహంపై సోనియాకు విఫులంగా ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. సీనియర్ నేతల బృందం దానిని పరిశీలించి వారం రోజుల్లో పార్టీ అధ్యక్షురాలికి నివేదిక సమర్పించనుంది. తరువాత సోనియా తుది నిర్ణయం తీసుకుంటారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముందుకు వెళ్లాల్సిన విధానంపై ఈ భేటీ జరిగిందని కిశోర్ సన్నిహిత వర్గాలు అంటున్నారు.

మరోవైపు, పార్టీలో సీనియర్‌ నేతలను అసంతృప్తికి గురిచేయకుండా మార్పులు తీసుకురావాలని గాంధీలు భావిస్తున్నారు. ఐతే, ప్రశాంత్ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియదు. ఇంతకీ ఆయన పార్టీలో చేరతారా, సలహాదారుగా ఉంటారా అనేది కూడా తెలియాల్సి వుంది. ఆయన కేవలం ఎన్నికల కన్సల్టెంట్‌ మాత్రమే కాదు 2018-20 మధ్య జనతా దళ్‌ (యూ) నేతగా ప్రత్యక్ష రాజకీయాలో క్రియాశీలంగా వ్యవహరించారు. సొంత పార్టీ కూడా పెడతారనే ఊహాగానాలు కూడా వనిపించాయి.

జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాగల సత్తా ఇప్పటికీ కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని పీకే బలంగా నమ్ముతారు. రాత్రికి రాత్రి కాంగ్రెస్‌ కథ మారకపోవచ్చు…కొంత సమయం పట్టినా బీజేపీ గద్దె దించే శక్తి హస్తం పార్టీకే ఉందంటారాయన.

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ మోడీ, షా ఇలాఖా గుజరాత్ పై కాంగ్రెస్‌ గురిపెట్టినట్టు తెలుస్తోంది. అందుకు ప్రశాంత్ కిశోర్‌ సేవలను పూర్తిగా వినియోగించుకోనుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు పోటీగా గుజరాత్ లో ఆప్‌ పాగా వేసే ప్రయత్నంలో ఉంది. ఆ రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్‌, యువనేత హార్దిక్‌ పటేల్‌ను తమ వైపు తిప్పుకోవాలని ఆప్‌ ప్రయత్నిస్తోంది. ఆయన రాష్ట్రంలో బలమైన పటీదార్‌ సామాజికవర్గానికి చెందినవారు.

హార్దిక్‌ పటేల్‌తో పాటు రాష్ట్రానికి చెందిన దళిత నేత జిగ్నేష్‌ మేవాని వంటి యువనేతలు గుజరాత్‌ కాంగ్రెస్‌లో ఉన్నారు. 2017 ఎన్నికలలో బీజేపీ 99 సీట్లు సాధించగా కాంగ్రెస్ కు 77 స్థానాలు వచ్చాయి. బీజేపీకి 49 శాతం ఓట్లు వస్తే కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు వచ్చాయి. తేడా స్వల్పంగానే ఉంది. పైగా రాష్ట్రంలో బీజేపీ దాదాపు మూడు దశాబ్దాలుగా అధికారంలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ప్రజలు మార్పు కోరుకునే అవకాశం ఉండొచ్చు. కనుక ఈ ఏడాది జరిగే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలలో ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాలతో బీజేపీకి షాక్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ ఉవ్విళ్లూరుతోంది.

గత ఏడాది కాంగ్రెస్ అధిష్ఠానం, ప్రశాంత్ కిశోర్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత కిశోర్ కాంగ్రెస్, రాహుల్ గాంధీపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత.. మరోసారి వారు కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారు. పార్టీలో కీలకంగా వ్యవహరించాలని ప్రశాంత్ కోరుకుంటున్నారు.

పీకే పార్టీలోకి రావటం పట్ల కొందరు సీనియర్లు అయిష్టత ప్రదర్శించవచ్చు. అందుకే పీకే వ్యవహార శైలి సీనియర్లు ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని అధిష్టానం భావిస్తోంది. మరి అందుకు ఆయన అంగీకరిస్తారో లేదో తెలియదు. కానీ స్వేచ్చ ఇస్తే కాంగ్రెస్‌ రాత మారే అవకాశం ఉందనటంలో సందేహం లేదు. దాంతో, బీజేపీకి కాంగ్రెస్ ఇక ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాద‌నే వారి నోళ్లు మూతపడవచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • LATEST TELUGU NEWS
  • NTV Specials
  • prashant kishor
  • sonia gandhi

తాజావార్తలు

  • PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్‌కు‌ డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..

  • AP Mobile Alert: మొబైల్‌లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!

  • Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్‌లో కలకలం..

  • Palakura Ullikaram Recipe : పాలకూర ఉల్లికారం.. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే రుచి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!

  • RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions