ఆర్టీసీ, విద్యుత్ చార్జీలతో ప్రజలపై ఎంత భారం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కష్టకాలంలో ప్రజలపై మరో పిడుగును వేసేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను సాకుగా చూపుతూ ఆర్టీసీ ఛార్జీలను.. డిస్కం నష్టాలను చూపుతూ విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కరోనాతో ఇప్పటికే ప్రజలంతా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంటే పులిమీద పుట్రలా మరో భారాన్ని మోపడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండటం శోచనీయంగా మారింది. ఈ పెంపు త్వరలోనే అమల్లోకి రానుందని తెలుస్తోంది.
కరోనా మహమ్మరి దెబ్బకు అన్నిరంగాల మాదిరిగానే ఆర్టీసీ సైతం కుదేలైంది. కరోనా సమయంలో చాలారోజులపాటు బస్సులు షెడ్డులకే పరిమితమయ్యాయి. బస్సుల రవాణా తిరిగి పునరుద్దరించినప్పటికీ కరోనా ఆంక్షల మధ్యే సాగాయి. ఈ కారణంగా ఆర్టీసీకి భారీగా నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీనికితోడు పెరిగిన పెట్రోల్, డిజీల్ ధరలు సైతం ఆర్టీసీ మనుగడను ప్రశార్థకంగా మార్చివేశాయి. ఆర్టీసీ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా మారింది. దీంతో ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఛార్జీల పెంపుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్‌పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
- love Or Attraction: లవ్‌లో పడిపోయారా..? అది ఆకర్షణ..? లేక ప్రేమేనా..?
- Valentine's Day: వాలెంటైన్ ఎవరు..? ప్రేమికుల దినోత్సవం ఎలా ప్రారంభమైంది..?
ఇటీవల ఆర్టీసీకీ ఎండీగా నియామకమైన సజ్జనార్ సైతం ఛార్జీల పెంపు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం సూత్రపాయంగా అంగీకరించిందని సమాచారం. అయితే ఏమేరకు ప్రజలపై భారం మోపాలి? అనే విషయాన్ని క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విద్యుత్ ఛార్జీల పెంపునకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కనబడుతోంది. ఎప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలను పెంచాలని డిస్కంలు పట్టుబడుతున్నాయి.
గడిచిన ఆరేళ్లుగా విద్యుత్ చార్జీలను ప్రభుత్వం సవరించలేదని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నారు. గత మార్చిలోనే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచుతామని హామీ ఇచ్చిందని అయితే కరోనా కారణంగా వాయిదా వేసిందనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యుత్ సంస్థలు గట్టెక్కాలంటే చార్జీలను పెంచాల్సిందేనని అధికారులు పట్టుబడుతున్నారు. దీనిపై త్వరలోనే క్యాబినెట్లో చర్చించి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ప్రస్తుతం హుజూరాబాద్ ఎన్నికల మూడ్ లో ఉంది. ఇక్కడ గెలుపును సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలను పెంచితే అది ఖచ్చితంగా ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. దీంతో ప్రభుత్వం హుజూరాబాద్ ఎన్నికల తర్వాతే విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంచే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తోంది. ఏదిఏమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటికి విరుగుడు మంత్రంగా ప్రజలపై భారం మోపుతూ వెళుతుండటం మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. కష్టకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే సామాన్యులపై భారం మోపుతుండటంతో వాళ్ల గోడు ఎవరికీ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది.
- Tags
- cm kcr
- power charges
- rtc
- telangana
- TSRTC
తాజావార్తలు
-
West Bengal: కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీకి ఘోర అవమానం..
-
RCB: పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్నా.. ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
-
White House: చైనాలో ట్రంప్ టూర్.. హార్ముజ్ జలసంధిపై వైట్‌హౌస్ కీలక ప్రకటన
-
Health Tips : పార్టీ చేసుకున్న మరుసటి రోజే జిమ్‌కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
-
Haji Ali Ship: హోర్ముజ్ జలసంధిలో ఘోరం.. భారత నౌకను ముంచేసిన డ్రోన్ దాడి!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్‌ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్‌ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?