కనకాంబరం పూలకు మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పూలతో కనకాంబరం కూడా పోటీపడుతోంది.. ఇక రైతులు వీటి సాగుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ మొక్క పరిస్థితులను తట్టుకొని దిగుబడినిస్తుంది. సాధారణంగా ఆరెంజ్, ఎరుపు, పసుపు రంగుల్లో ఈ పూలు కనిపిస్తుంటాయి. ఇందులో ప్రధానంగా ముదురు నారింజ రంగుకు చెందిన ఆరెంజ్ సాంద్రో రకం మంచి దిగుబడులను తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు..
మల్లెపూల లాగా ఇవి సువాసన వెదజల్లకపోయినా చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వీటి సాగు విషయానికొస్తే అధిక తేమ, వేడి కలిగిన ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. చల్లని వాతావరణ పరిస్థితుల్లో సైతం కనకాంబరం సాగుతో మంచి లాభాలు పొందవచ్చు. మొక్క పెరుగుదలకు 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకూలం.. 13 డిగ్రీల వేడి వీటికి మంచిది.. ఈ ఉష్ణోగ్రతలో నే పూలకు మంచి రంగు వస్తుంది..నీళ్లు లేని అంటే నీళ్లు నిలవని నేలలు ఈ పూల సాగుకు అనుకూలం.నారుమడి చేసుకొని అందులో నారు పోసుకోవడం మంచిది. మొక్కలకు 15-20రోజుల వయసు వచ్చిన తరువాత బెడ్లు ఏర్పాటు చేసుకొని ప్రధాన క్షేత్రంలో నాటుకోవాలి.. మొక్క బాగా పెరుగుతుంది..
ఈ పూలను ఒక ఎకరాకు 16 వేల మొక్కలను నాట్టుకోవాలి..ఈ పంటకు తెగుళ్ల సమస్య ఎక్కువే. కాబట్టి, ఎప్పటికప్పుడు సాగు విషయంలో రైతు జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మొక్కలు నాటిన మూడు నెలలకు పూలు పూయడం మొదలవుతుంది. కాబట్టి అది రైతుకు కీలక సమయం. ఈ మొక్క నీటి ఎద్దడిని సైతం తట్టకోగలదు. సాగు చేస్తున్న నేల స్వభావం, అవసరాన్ని బట్టి ప్రతీ 15 రోజుల వ్యవధిలో డ్రిప్ విధానంలో మొక్కలకు నీటిని అందించాలి.. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి.. అదే విధంగా చల్లగా ఉండటం వల్ల నీళ్ల తడిని తగ్గించుకోవడం మంచిది..