Viral Video: సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత.. ప్రజల్లో దాగి ఉన్న ప్రతిభ బంధాలను తెంచుతోంది. అడ్డంకులు లేకుండా దూసుకుపోతోంది. పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, వంట చేయడం.. సోషల్ మీడియాకు ఏదీ అన్ ఫిట్ కాదంటూ నెటిజన్లు తమ సత్తా చాటుతున్నారు. ఇలా వైరల్ అయిన వారు చాలా మంది ఉన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఫేమస్ అయ్యే అవకాశాలు ఉండటంతో సోషల్ మీడియాను గొప్ప వేదికగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా డ్యాన్స్‌కి సంబంధించిన పలు వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఫోక్, వెస్ట్రన్, క్లాసికల్, మాస్… ఇలా ఒక్కటేమిటి వాటి జాబితా చెప్పుకుంటూ పోతే అనంతమే అని చెప్పాలి. చాలా మంది వారికి నచ్చిన రీతిలో అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బెల్లీ డ్యాన్స్ మనందరికీ తెలుసు. దీన్ని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఈ బిల్లీ డ్యాన్స్‌లో అంటూనే మనకు టక్కున గుర్తుకు వచ్చేది బాలీవుడ్‌ను తన బెల్లీ డ్యాన్స్‌తో షేక్ చేస్తున్న నోరా ఫతేహి గుర్తుకు రావాల్సిందే. ఆమె బెల్లీ డ్యాన్స్ చేస్తే కుర్రాళ్లకు చెమట పట్టాల్సిందే. ఇక బెల్లీ డ్యాన్స్ సమంత సాంగ్‌ను జోడిస్తూ.. ఓఅమ్మాయి బెల్లీ డ్యాన్స్ ఇప్పడు చక్కర్లు కొడుతోంది.
Read also: Cheating Couple: సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో దంపతులు భారీ మోసం.. లబోదిబో మంటున్న బాధితులు
పుష్ప చిత్రంలోని సమంత చేసిన ఐటమ్ సాంగ్ ఊ..అంటావా మావా.. ఊఊ.. అంటావా మావా అనే పాటకు అనే పాటకు ఓ యువతి బెల్లీ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. నడుపు ఊపుతూ చేస్తుంటే అందరిని ఆకట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ భయానీ షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు సుమారు 60వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతే కాకుండా నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు. ‘మీ డ్యాన్స్‌కు హ్యాట్సాఫ్’ అంటూ మరో నెటిజన్ సరదాగా రాశారు. మీచేసిన ఈ ‘డాన్స్ అనేది ఈ ప్రపంచంలోనే అత్యంత కష్టమైన కళ’ అంటూ మరో నెటిజన్ ఫన్నీగా రాసుకొచ్చారు. నీముందు నోరా కూడా దిగదుడుపే అంటూ కామెంట్లు పెడుతున్నారు. నీకళ ముందు మేమూ ఊ.. అనాల్సిందే అంటూ మరో నెటిజన్లు కమెంట్ల మీద కమెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.