ఓపిక అంటే మహిళలే… భూదేవికి ఉన్నంత ఓపిక ఆడవాళ్లకు ఉంటుంది అని చెబుతుంటారు.. అయితే, అన్నిసార్లు ఓపికగా ఉండాలన్న రూలేమీ లేదుగా.. కొన్నిసార్లు అది కట్టులు తెచ్చుకుంటుంది.. తమ చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు.. తమ వరకు వచ్చే చిన్నా చితక విషయాలతోనూ వారు కయ్యానికి కాలుదువ్వే సందర్భాలు అనేకమే.. చిన్న చిన్న విషయాలకే మాటామాట పెరిగి సిగపట్లు పట్టుకున్న సందర్భాలు చాలానే చూస్తుంటాం.. ఈ మధ్యే ముంబైలో లోకల్ ట్రైన్‌లో సీటు విషయంలో ఇద్దరు మహిళల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు.. జిమ్‌లో ఒక పరికరం కోసం ఇద్దరు మహిళ మధ్య జరిగిన ఘర్షణ నెట్టింట రచ్చ చేస్తోంది.
Read Also: Major Investment: తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. రూ.700 కోట్లతో వ్యాక్సిన్ తయారీ కేంద్రం..
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ప్రకారం.. ఒక జిమ్‌లో కొందరు మహిళలు ఎక్స్‌సైజులు చేస్తున్నారు.. వెయిట్ లిఫ్టింగ్ వద్ద ఒక మహిళ తన వంతు కోసం ఎదురు చూస్తుండగా.. ఇంతలో మరో మహిళ ఎంట్రీ ఇచ్చి.. వెయిట్ లిఫ్టింగ్ పరికరం కోసం ఎదురు చూస్తున్న మహిళను పక్కకు తోసేసింది.. దీంతో అప్పటి వరకు ప్రశాతంగా ఎదురుచూస్తున్న ఆమె.. ఒక్కసారిగా తిరగబడింది. ఇంకేముందు.. వారిద్దరూ ఒకరి జుట్టును మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. అక్కడున్న మిగతా మహిళలు వారిద్దరినీ అతికష్టం మీద విడిపించారు.. ఈ ఘటన మొత్తం ఆ జిమ్‌లోని సీసీటీవీలో రికార్డు అయ్యింది.. అయితే, ఒక యూజర్ ట్విట్టర్‌లో అది షేర్ చేయడంతో.. వైరల్‌గా మారిపోయింది.. ఇక, దీనిపై కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ‘హే నాకు ఆడవాళ్ల పోరాటాలు అంటే చాలా ఇష్టం.. కానీ జుట్టు లాగడం తప్ప వారికి వేరే ఎందుకు లేదు? అంటూ కామెంట్ పెట్టాడు ఓ నెటిజన్.. మరొకరు “అందుకే నేను జిమ్‌కి వెళ్లను, హోమ్ వర్కౌట్స్ మరియు మార్నింగ్ వాక్ చేస్తాను”.. అంటూ మరో వ్యక్తి కామెంట్ రాసుకొచ్చాడు.. మొత్తంగా వినోదభరితమైన, ఫన్నీ వీడియోలను ఇంటర్నెట్‌లో వైరల్ చేసే వాళ్ల దృష్టిని ఈ వీడియో ఎంతో ఆకర్షిస్తుంది..
Kalesh Inside GYM for Smith Machine pic.twitter.com/KXy6v9UyWj
— r/Bahar Ke Kalesh (@Baharkekalesh) October 9, 2022