ఈ మధ్య జనాలకు ఏ వీడియో షేర్ చేయాలో .. ఏది షేర్ చేయకూడదో.. బొత్తిగా అర్థం కాకుండా పోతుంది. ప్రైవసీకి సంబంధించిన వీడియోలు కూడా డైరెక్ట్ గా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. లైక్స్, ఫాలోవర్స్, డబ్బు కోసం హద్దు అనేది లేకుండా పిచ్చి పనులన్నీ చేసేస్తున్నారు. అందరిచేత ఛీ అనిపించుకుంటున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. పెళ్లి తర్వాత జరిగే తంతు శోభనం.. ఇది చాలా సీక్రెట్ గా కేవలం.. వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఏర్పాటు చేసే కార్యం.. కొత్త జంటను గదిలో పంపే వీడియోని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలో శోభనం గదికి వెళ్లే ముందు కొత్తబటల్లు, మల్లెపూల దండలు వేసుకుని.. పాల గ్లాసు పట్టుకుని సిగ్గుపడుతుండగా.. లోపలికి వెళ్లి ఎంజాయ్ చేయమంటూ ఎంకరేజ్ చేశారు ఫ్రెండ్స్. లోపలికి వెళ్లాక బెడ్ ఎలా సర్దారు.. ఎలా ఉండాలనేది కూడా చెప్పారు.
ఇది ఎక్కడ జరిగిందో.. పూర్తి వివరాలు తెలియలేదు.. ఈ వీడియో చూసిన వారంతా దారుణంగా తిడుతున్నారు. ఇలా శోభనం గది వీడియోలను పది మందితో పంచుకునేందుకు సిగ్గులేదా అని తిడుతుున్నారు.. మరి కొందరైతే ఫస్ట్ పార్ట్ అదిరింది.. మరి సెకండ్ పార్ట్ ఎప్పుడంటూ ట్రోల్ చేస్తున్నారు.