Video Games: వీడియో గేమ్స్‌తో పిల్లలకు ప్రాణాపాయం.. గుండె సమస్యలు తప్పవు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Video Games: ఈరోజుల్లో ప్రతి ఇంట్లో చిన్నారులు వీడియో గేమ్స్‌తో మాత్రమే కాలక్షేపం చేస్తున్నారు. చిన్నారులకు స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్ ఉంటే చాలు. తిండి తినడం కూడా మానేస్తున్నారు. వీడియో గేమ్స్‌కు అంతగా వాళ్లు ఎడిక్ట్ అయిపోయారు. అయితే ఈ వ్యాపకం పిల్లలకు ప్రాణాపాయంగా పరిణమించే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియాలోని హార్ట్ సెంటర్ ఫర్ చిల్డ్రన్ పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ మేరకు అధ్యయనం చేసిన నివేదికను సైంటిస్టులు హార్డ్ రిథమ్ అనే జర్నల్‌లో ప్రచురించారు. సాధారణంగా కొందరు పిల్లల స్పందన క్రమబద్ధంగా ఉండదని.. తల్లిదండ్రులు ఈ విషయాన్ని ముందుగా గుర్తించరని.. అలాంటి చిన్నారులు వీడియో గేమ్స్ ఆడినప్పుడు వారి హృదయంపై తీవ్ర ఒత్తిడి నెలకొని ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని సైంటిస్టులు తమ నివేదికలో అభిప్రాయపడ్డారు.
Read Also: Elnaaz Norouzi: హిజాబ్ ఉద్యమానికి మద్దతుగా బట్టలన్నీ విప్పేసిన నటి
Also Read
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
కొంతమంది చిన్నారులు వీడియో గేమ్స్ చూస్తూ స్పృహ కోల్పోవడం వీరిలో సమస్యకు మొదటి సూచన అని పరిశోధకులు హెచ్చరించారు. మల్టీప్లేయర్ యుద్ధాల తరహా వీడియో గేమ్స్‌లో అధిక శాతం మంది స్పృహ కోల్పోయినట్లు గుర్తించామని వారు తెలిపారు. అయితే కొందరు చిన్నారులకు ఏకంగా గుండె ఆగిపోయిందని పరిశోధనలో వెల్లడైంది. అయితే చిన్నారులు స్పృహ కోల్పోతే వారిని వెంటనే హృద్రోగ నిపుణులకు చూపించాలని సైంటిస్టులు సూచించారు. కాటెకొలామినెర్జిక్ పాలీమార్ఫిక్ వెంట్రిక్యులర్ టాకీకార్డియా (సీపీవీటీ), కాంటెనిటల్ లాంగ్ క్యూటీ సిండ్రోమ్ (ఎల్‌క్యూటీఎస్) అనే సమస్య చిన్నారుల్లో ఈ అనారోగ్యం తలెత్తేందుకు కారణమవుతుందని.. ఎలక్ట్రానిక్ గేమింగ్ విధానంలో పిల్లల కుటుంబాలు, ఆరోగ్య సంస్థలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు తెలిపారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!