భారత దేశాల చట్టాల ప్రకారం.. మహిళలు కానీ, పురుషులు కానీ కేవలం ఒకరినే వివాహం చేసుకోవాలి. ఒక వేళ చట్ట ప్రకారం విడిపోతే రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అయితే ఓ గ్రామంలో మాత్రం వింత ఆచారం నడుస్తోంది. ఇక్కడి మహిళలు ప్రతిఏడాది కొత్త వ్యక్తిని ఎంచుకునే అవకాశం ఉంది. ఈ వింత ఆచారం గురించి వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా.. కానీ నిజం ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.
Read Also: Priyanka Chopra : చీరలో ప్రియాంక చోప్రా.. కత్తిలాంటి అందాలు చూశారా
పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని గరాసియా తెగలో వింత ఆచారం ఉంది. ప్రతి ఏడు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. అయితే జాతరలో మహిళలు కొత్త భాగస్వామిని ఎన్నుకోనే హక్కు ఉంటుంది. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తారు. సహజీవనం కోసం అబ్బాయి అమ్మాయికి కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. అమ్మాయికి గర్భం వస్తే మాత్రం పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎన్నుకున్న అబ్బాయితో కాకుండా మరొక వ్యక్తితో జీవించాలనుకునే అవకాశం కూడా ఉంది. అయితే కొత్త ఎన్నుకున్న అబ్బాయి .. మాజీ భాగస్వామికి ఎక్కువ మొత్తంలో నగదు ఇవ్వాలి.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త విన్న నెటిజన్లు మాత్రం ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదెక్కడి వింత ఆచారం రా నాయనా అనుకుంటున్నారు.