Viral News : వడదెబ్బతో షాకింగ్ ఘటన..! పెట్రోల్ బంకులో నగ్నంగా వ్యక్తి

  • ఎండ తీవ్రతతో షాకింగ్ ఘటన థాయిలాండ్‌లో
  • స్పృహ కోల్పోయి నగ్నంగా పెట్రోల్ బంకులోకి వ్యక్తి
  • వడదెబ్బతో మానసిక స్థితి మారే ప్రమాదం
  • ఎండల్లో ప్రయాణాలపై అధికారుల హెచ్చరికలు
Heat Stroke

Heat Stroke

భానుడి భగభగలకు మనుషులు ప్రాణాపాయ స్థితికి చేరుకోవడమే కాకుండా, ఒక్కోసారి వారి మానసిక స్థితి కూడా తలకిందులవుతుందని నిరూపించే ఘటన ఒకటి థాయిలాండ్‌లో వెలుగుచూసింది. ఖోన్ కేన్ ప్రాంతంలో ఒక వ్యక్తి తీవ్రమైన ఎండలో సుదీర్ఘకాలం ప్రయాణించి, చివరకు మతిస్థిమితం కోల్పోయిన స్థితిలో నగ్నంగా పెట్రోల్ బంకులోకి రావడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు.

బాధితుడు తన మోటార్‌సైకిల్‌పై వివిధ ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ వస్తున్నాడు. ఆ సమయంలో ఎండ తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. చాలా సేపు ఎండలో ప్రయాణించడం, శరీరంలో నీటి శాతం తగ్గిపోవడంతో అతను తీవ్ర అసహనానికి లోనయ్యాడు. సరిగ్గా ఒక పెట్రోల్ బంకు సమీపానికి వచ్చేసరికి అతని బైక్‌లో ఇంధనం (పెట్రోల్) అయిపోయింది.

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. లక్షల కోట్ల సంపద ఆవిరి

బైక్ ఆగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఆ వ్యక్తి, తీవ్రమైన వేడి ధాటికి తనపై తనకు నియంత్రణ కోల్పోయాడు. ఒంటిపై ఉన్న బట్టలన్నీ విప్పేసి, దిగంబరంగా పెట్రోల్ బంకులోకి నడుచుకుంటూ వచ్చాడు. అతడిని చూసిన అక్కడి సిబ్బంది, వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురై దూరం జరిగారు. అతను ఎవరితోనూ మాట్లాడలేక, ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు అతనికి ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ.. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని, ఎండలో విశ్రాంతి లేకుండా ప్రయాణించడం వల్లే అతనికి ‘హీట్ స్ట్రోక్’ (వడదెబ్బ) తగిలి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. వడదెబ్బ తగిలినప్పుడు మెదడు పనితీరు మందగించి, మనుషులు తమ ప్రవర్తనపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు ప్రయాణాలు చేసే వారు తగినంత నీరు తాగాలని, నీడ ఉన్న చోట విశ్రాంతి తీసుకోవాలని కోరారు. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా అది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ ఘటన హెచ్చరిస్తోంది.

Silent Signs Of Stress: ఒత్తిడిని కనిపెట్టడం ఎలా..? శరీరమిచ్చే సంకేతాలివే..