ప్రపంచంలో చాలా రకాల గేమ్స్ జరుగుతుంటాయి. కొన్ని క్రేజీగా ఉంటే మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. ఫన్నీ గేమ్స్ టోర్నమెంట్‌లో గోఫిష్ టోర్నమెంట్ కూడా ఒకటిగా చెప్పవచ్చు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా నగాంబీలోని ఫ్రెష్ వాటర్ కెనాల్‌లో ఈ టోర్నమెంట్ ను నిర్వహించారు. ముర్రె కాడ్ ఫిష్ లకు ఈ నగాంబీ ఫ్రెష్ వాటర్ ప్రసిద్ది. ఇందులో ముర్రె కాడ్ ఫిష్‌లు ఎక్కువగా నివసిస్తుంటాయి. ఎవరైతే పెద్దవైన ముర్రె కాడ్ ఫిష్ ను పట్టుకుంటారో వారికి 80 వేల డాలర్లను ప్రైజ్ మనీగా ఇస్తారు. ప్రతి ఏడాది జరిగే ఈ ముర్రె కాడ్ ఫిష్ టోర్నమెంట్లో వందలాది మంది పాల్గొంటారు.
Read: Mahindra: ఇకపై లీజుకు మహీంద్రా కార్లు… ఎలా తీసుకోవచ్చంటే…
18 ఏళ్ల జాన్ మూర్‌అనే యువకుడు ఈ గో ఫిష్ టోర్నమెంట్‌లో పాల్గొని విజయం సాధించాడు. మూర్ గాలం వేసిన 20 నిమిషాల్లోనే కాడ్ ఫిష్ చిక్కింది. పెద్దదైన ఈ కాడ్ ఫిష్‌ను నీటి నుంచి పైకి తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని అన్నాడు. నగాంబీ ఫ్రెష్ వాటర్‌లో చిన్నవాటి నుంచి పెద్దవాటి వరకు చాలానే ఉన్నాయి. అయితే, గత కొంతకాలంగా వీటి సంఖ్య తగ్గిపోతూ వస్తున్నది. ఈ కాడ్ ఫిష్‌లు సర్వభక్షకులు. వీటిని ప్రిడేటర్ కాడ్ ఫిష్ అని పిలుస్తుంటారు. తనకంటే చిన్నవైన వాటిని తినేస్తుంటాయి. పెద్ద మూతి, చిన్నవైన కళ్లుకలిగిన కాడ్ ఫిష్‌లు చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి. గో ఫిష్ టోర్నమెంట్‌లో తాను విజయం సాధిస్తానని అనుకోలేదని జాన్ మూర్ పేర్కొన్నాడు.