ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జీవులలో పాములు ఒకటి. అయితే అందులో కొన్ని పాములు విషపూరితమైనవి ఉంటే.. మరికొన్ని ప్రమాదకరమైనవి కానివి కొన్ని ఉంటాయి. భూమిపై ఉన్న పాములలో విషంలేనివి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే వాటికి విషం లేకున్నా కానీ.. అవి ప్రమాదకరం. ఆ జాతికి సంబంధించిన పాములలో కొండచిలువ, అనకొండ వంటివి ఉన్నాయి. అవి చూడటానికి చాలా భయంకరంగా, పెద్దవిగా ఉంటాయి. అవి ఎక్కువగా దట్టమైన అడవులలో, నది సమీపంలో ఉంటాయి. అనకొండ చిన్న జంతువులను సులభంగా నోటితో మింగగలవు. అంతేకాకుండా.. వాటి కండర శక్తితో వాటి ప్రాణాలు తీయగలవు. అయితే ఇప్పుడు.. ఓ అనకొండకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Supreme Court: ‘మూడేళ్లుగా గవర్నర్ ఏం చేస్తున్నారు?’.. తమిళనాడు బిల్లుల జాప్యంపై సుప్రీంకోర్టు
ఆ వీడియోలో.. ఓ వ్యక్తి ఎటువంటి భయం లేకుండా నీటిలో ఉన్న భారీ అనకొండను పట్టుకుని బయటకు తీస్తాడు. ముందుగా అనకొండ తోకను పట్టుకుని నీరు తక్కువగా ఉన్న చోటికి లాగుతాడు. ఆ తర్వాత మెల్లగా పాము నోటిని పట్టుకుంటాడు. అప్పుడు పాము అతని చేతిని చుట్టిపడేస్తుంది. ఆ పాము పట్టు విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. అలాగే గట్టిగా పట్టుకుంటుంది. చాలా కష్టంతో దాని నుంచి పట్టు వదిలించుకుని.. ఆ తర్వాత పాము తలపై ముద్దుపెడుతాడు. అది చూస్తే గూస్ బంప్స్ వస్తుంది. అనకొండ ప్రమాదకరమని తెలిసినా.. అతడు అస్సలు భయపడడు.
Amit Shah: బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కుటుంబ పార్టీలు..
భారీ అనకొండను పట్టుకున్న వ్యక్తిని మైక్ హోల్స్టన్ గా గుర్తించారు. మైక్ స్వయంగా ఈ వీడియోను తన ఇన్స్టాగ్రాం ఐడీలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 7 మిలియన్లకు పైగా చూశారు. అంతేకాకుండా.. 2 లక్షల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అంతేకాకుండా.. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.