ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్‌మహల్‌కు కూడా స్థానం ఉంటుంది. తాజ్‌మహల్‌ను షాజహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు. ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్ అందాన్ని చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు తరలివస్తుంటారు. అయితే తాజ్‌మహల్‌పై రాత్రిపూట విద్యుత్ దీపాలు ఉండవు. ఇలా ఎందుకు ఉండవో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సైంటిఫిక్ రీజన్ ప్రకారం.. తాజ్‌మహల్‌ను మార్బుల్‌తో నిర్మించారు కాబట్టి రాత్రిపూట విద్యుత్ లైట్లు వేస్తే మరింత కాంతివంతంగా కనిపిస్తుంది. కానీ చరిత్రకారులు తాజ్‌మహల్ కట్టడంపై ఎలాంటి లైట్లు ఏర్పాటు చేయలేదు.
Interesting Fact: ఒకరు ఆవులిస్తే మరొకరికి ఆవులింత ఎందుకు వస్తుందో తెలుసా..?
అయితే తాజ్‌మహల్‌పై విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయకపోవడానికి బలమైన కారణం ఉంది. తాజ్‌మహల్ యమునా నదీ తీరంలో ఉంటుంది. ఒకవేళ లైట్లు ఏర్పాటు చేస్తే ఎక్కువ కాంతి వస్తుంది కాబట్టి పురుగులు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు పురుగులు, దోమలు విసర్జించే పదార్ధాలతో తాజ్‌మహల్‌తో పాటు తాజ్ పరిసరాలు అపరిశుభ్రంగా మారతాయి. తాజ్‌మహల్ మార్బుల్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అందమైన తాజ్‌మహల్‌ను విద్యుత్ దీపాల కాంతిలో కంటే చందమామ కాంతిలో చూస్తే మరింత అందంగా కనిపిస్తుంది. ఈ కారణం వల్లే చరిత్రకారులు తాజ్‌మహల్‌పై దీపాలు ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది.