సాధారణంగా మనిషి మెదడు లో చాలా నరాలు ఉంటాయి.. వాటి గురించి చాలామందికి తెలియవు. మనిషి చేసే ప్రతి పనికి మెదడుకు సంబంధం ఉంటుంది అనేది అందరికి తెలిసిందే. ఇక రోజూ మనం చూస్తూ ఉంటాం. ఎదుటి వ్యక్తి ఆవులిస్తే.. మనకు ఆవులింతలు వచ్చేస్తాయి.. ఎదుటి వారు మనముందు ఏదైనా తింటూ ఉంటే మనకు తినాలనిపిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని పనుల్లో వారు ఏది చేస్తే అదే చేయాలనిపిస్తూ ఉంటుంది.. దీనికి కారణం ఏంటి అనేది చాలామందికి తెలియదు.. అయితే వైద్యులు మాత్రం దీనికి కారణం మెదడు అంటున్నారు. దీని గురించి సీరియస్ పరిశోధనలు కూడా జరగడం విశేషం.. ఈ ఆవులింత వెనుక మాత్రం సైన్స్ ఉంది.. మన మెదడు ఎప్పుడు మన అధీనంలో ఉండదు.. దానికి మనం చేసే ప్రతి పనితో సంబంధం ఉంటుంది. అమెరికాలోని న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ యూనివర్శిటీలో నిర్వహించిన పరిశోధనలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
ఎదుటి వ్యక్తి ఆవులిస్తే.. మనకు ఆవులింతలు వస్తే మెదడులో ఉండే మిర్రర్ న్యూరాన్ వ్యవస్థ పనిచేస్తునట్లే.. అంటే ఎదుటువారు ఏ పని చేసినా ఆ పని చేయమని మిర్రర్ న్యూరాన్ వ్యవస్థ లో ఉన్న నరాలు మన మెదడుకు ప్రేరేపిస్తాయి అంట. దీనివల్లనే ఒక వ్యక్తి తన ముందు మరొక వ్యక్తి ఆవులించడం లేదా ఆవులించడం చూసినప్పుడు వారికి ఆటోమేటిక్ గా ఆవులింతలు వచ్చేస్తాయి. ఒక్కరి విషయంలోనే అని కాదు.. ఇది ఎవరి విషయంలోనైనా ఇలాగే జరుగుతుంది. చివరకు డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ సైతం పక్క సీట్లో ఉన్న వ్యక్తి ఆవులిస్తే ఆవులించాక మానడట. అటువంటి పరిస్థితిలో అతని మెదడు అతనిని నిద్రపోయేలా చేస్తుంది. అతని స్వల్ప నిద్ర ప్రమాదానికి కారణమవుతుంది. అందుకే పెద్దలు చెప్తారు. డ్రైవర్ పక్కన కూర్చున్నవారు నిద్రపోవడం కానీ, ఆవులించడం కానీ చేయకూడదని.. ఇక ఇదేమి నార్మల్ గా శాస్త్రవేత్తలు చెప్పలేదు.. దాదాపు 300 మందిపై పరిశోధన చేసి ఈ విషయాన్ని కనుగొన్నారు.