Jaipur: ప్రస్తుత సమాజంలో క్షణం కూడా సెల్ ఫోన్ లేకుండా బ్రతికే పరిస్థితి కనిపించడం లేదు. ఏం చేయాలన్న దానిపై ఆధారపడాల్సి వస్తుంది. అలాంటి, అర క్షణం ఫోన్ మన చేతిలో లేకపోతే ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతాం.. అది మన చేతిలో నుంచి జారీ కిందపడి పగిలిపోతే, నీటిలో పడి పాడైపోతే.. అప్పుడు ఉంటది చూడు బాధ వర్ణనాతీతం అని చెప్పాలి. అయితే, తాజాగా, జైపూర్‌లోని రామ్నివాస్ బాగ్ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో రోడ్డుపై వరద పేరుకుపోయింది. అయితే, హల్దార్ అనే యువకుడు తన యాక్టివా స్కూటీపై ఆ మార్గంలో వెళ్తుండగా వరద నీటిలో ఒక్కసారిగా జారిపడ్డాడు. దీంతో అతడితో పాటు తన మొబైల్ ఫోన్ కూడా నీటిలోకి జారిపోయింది.
Read Also: Srisailam: శ్రీశైలంలో కృష్ణమ్మ పరవళ్లు.. పర్యాటకుల తాకిడి..!
ఇక, దీంతో హల్దార్ తన ఫోన్ కోసం మురికి నీటిలో చాలా సేపు వెతికినా, ఫలితం దక్కలేదు.. దీంతో దిక్కుతోచని స్థితిలో రోడ్డు పక్క ఉన్న పూట్ పాత్ పై కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చాడు. అలా, రోడ్డు మీద కూర్చొని ఏడుస్తుండగా.. అటుగా వెళ్లిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై కొంత మంది యూజర్లు ఫన్నీ కామెంట్స్ చేయగా.. మరికొందరు నెటిజన్స్ ఎమోషనల్ గా రియాక్ట్ అవుతున్నారు. అయితే, రాంనివాస్ బాగ్ సమీపంలోని ప్రాంతం ఒకవైపు వాలు కలిగి ఉందని.. అలాగే, అధ్వాన్నమైన డ్రైనేజీ వ్యవస్థ వల్ల వర్షం పడినప్పుడల్లా నీరు భారీగా పేరుకుపోతుంది.. దీంతో అనేక మంది వాహనదారులు కింద పడిపోతుందని స్థానికులు వెల్లడించారు.
Guy breaking down in tears after his mobile phone reportedly slipped into rainwater in Jaipur.
pic.twitter.com/JBx0dwQziw— Ghar Ke Kalesh (@gharkekalesh) July 10, 2025