Lion Attack: అడవి రాజు సింహం గురించీ ఎవరికీ కొత్తగా చెప్పక్కర్లేదు. దాని గొంతు వినగానే ముక్కు మీద చెమట పట్టేసే గంభీరత దానిసొంతం. అలాంటి సింహం బోనులో ఉన్నా.. బయట ఉన్నా ఒళ్లు దగ్గరపెట్టుకొని ప్రవర్తించాలి. అలా కాదని కొంటె చేష్టలతో దాన్ని రెచ్చగొడితే ఈ వ్యక్తి జరిగిన గతే పడుతుంది. ఈ వీడియలో కనిపించే వ్యక్తి సింహం బొమ్మ అనిపించిందో ఏమో కానీ, నిజంగా ఉన్న సింహాన్ని ఆటబొమ్మలా చూసాడు. బోను దగ్గరగా వెళ్లి చేతిని చాచి అల్లరి చేశాడు. అంతే మృగరాజుకు కోపం వచ్చింది.
Sama Ram Mohan Reddy : కవిత లేఖ గురించి పది రోజుల ముందే చెప్పా.. కవిత చెప్పిన దెయ్యాలు వాళ్లే
ఒక్కసారిగా ఝట్కా ఇచ్చి చేతిపై గట్టిగానే గీరింది. చీపురుతో కొట్టినట్లు కాదు బాస్.. నిజంగా.. దీంతో సింహం పంజాలోని ఓ గోరు ఆ వ్యక్తి చేతిలో దిగి రక్తం కారింది. ఒక్కసారిగా సింహం పంజాతో బెంబెలెత్తిపోయి సదరు వ్యక్తం లబోదిబోమంటూ ఆసుపత్రికి పరిగెత్తాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను “aladdenn” అనే ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. మే 22న పెట్టిన ఈ వీడియోకి ఇప్పటికే 5.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే.. “ధైర్యానికి కూడా హద్దు ఉండాలి బాబు!” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Bellamkonda Sai Sreenivas: ఆ సర్ ప్రైజ్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు
Satisfying ending
https://t.co/B4XVodtVYV— Komal (@Komal_Indian) May 23, 2025