కరోనా వైరస్ మహమ్మారిగా మారిన తరువాత మనకు తెలియని అనేక పేర్లను వింటున్నాం. పాండమిక్, క్వారంటైన్, ఐపోలేషన్ ఇలా రకరకాల పేర్లను వింటున్నాం. అయితే, ఐసోలేషన్ అనే పేరు జపాన్‌లో ఎప్పటి నుంచే వాడుకలో ఉన్నది. అక్కడ ఒక కల్చర్ ఇప్పటికీ అమలు చేస్తున్నారు. అదే హికికోమోరి విధానం. దీని అర్ధం సమాజానికి దూరంగా ఇంట్లోనే గడపడం. అదీ నెల రెండు నెలలు కాదు…సంవత్సరాల తరబడి ఇంటికే పరిమితం అవుతుంటారు.
Read: ‘ఆర్ఆర్ఆర్’ సెట్లో చరణ్.. స్టిల్స్ వైరల్
ఇంటి నుంచే వివిధరకాల పనులు చేసుకుంటూ, కావాల్సిన వాటిని ఆన్‌లైన్ లో తెప్పించుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఇలాంటివారు ఇళ్లు వదిలి బయటకు వెళ్లాలి అంటే అవమానంగా భావిస్తారట. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే … పని చూసుకొని వెంటనే తిరిగి వస్తారట. జపాన్‌లో 5 లక్షల మందికి పైగా యువత, మరో 5 లక్షల మంది వరకు మధ్యవయస్కులు ఈ హికికోమోరి విధానాన్ని అనుసరిస్తున్నారని అక్కడి గణాంకాలు చెబుతున్నాయి.