మనుషులకు మాత్రమే కాదు జంతువులకు కూడా ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. అది అవసరం కూడా… ఇదే విషయాన్ని తెలియజేసింది ఒక సీల్. సాధారణంగా సముద్రాల్లో సీల్ చేపలు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఓ స్కూబా డైవర్ సముద్రంలో డైవింగ్ కు వెళ్లగా… అక్కడ ఓ సీల్ అతన్ని కౌగింతలతో ఉక్కిరిబిక్కిరి చేసేసింది. అంతేకాదు ఆ సీల్ సదరు స్కూబా డైవర్ చేతులను పట్టుకుని హాగ్ చేయసుకోమని అడుగుతోంది కూడా. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను భారత అటవీ సేవా అధికారి సుశాంత నందా గురువారం ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఆయన ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే భారీ సంఖ్యలో లైకుల వర్షం కురిసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Love wrapped up within a hug💕
— Susanta Nanda IFS (@susantananda3) April 15, 2021
From ocean diversity pic.twitter.com/IdYYYvcqBN