పెళ్ళంటే పందిళ్లు.. తప్పెట్లు తాళాలు.. బాజాలు భజంత్రీలు.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. అంటూ మనం పెళ్లిళ్ళ గురించిన పాట వింటుంటాం. ఎవరికైనా జీవితంలో పెళ్ళి అద్భుత ఘట్టం.. మరపురాని అనుభవం.. అలాంటి పెళ్ళి అందరి సమక్షంలో ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు మీద జరగాలని భావిస్తారు. అయితే పెళ్లిళ్ళు అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు.
Read ALso: Chikoti Praveen Meets MLA Raja Singh: బీజేపీ ఎమ్మెల్యేతో క్యాసినో కింగ్ భేటీ
భారీవర్షాలు తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాల ప్రభావం పెళ్ళిళ్లపై కూడా పడింది. చెన్నై నగరంలో అనేక కళ్యాణ మంటపాలు వివాహాల కోసం బుక్ అయ్యాయి. అయితే, కాలం అనుకూలించలేదు. పెళ్ళిళ్ళు అన్నీ ఆలస్యం కావడం లేదా రద్దవడం జరిగింది. చెన్నైలోని పులియన్ తోపె ప్రాంతంలో వర్షం నీటిలోనే ఒక జంట ఏకమయింది. నగరంలో ఏ ప్రాంతం చూసినా వర్షంతో అల్లాడుతోంది.
పెళ్ళిళ్ళు జరిగే దేవాలయాల్లో కూడా రెండు మూడు అడుగుల నీళ్ళు వచ్చిచేరాయి. దీంతో పెళ్ళిని రద్దుచేసుకోలేక పెళ్లికూతురు, పెళ్లికొడుకు పెళ్ళి చేసుకుని, వరద నీటి సాక్షిగా ఏడడుగులు నడిచారు. పెళ్ళిళ్లు అన్నీ ప్రస్తుతం ఇదే పరిస్థితుల్లో జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పెళ్ళి కొడుకు, పెళ్లికూతుళ్లను ట్రాక్టర్లలో, డ్రమ్ముల్లో కళ్యాణ మంటపానికి తీసికెళ్లి మూడుముళ్లు వేయించేస్తున్నారు. లక్షలు ఖర్చుపెట్టి ముహూర్తానికి పెళ్లి కాకుంటే కష్టమే కదా మరి. పెళ్ళిళ్ళు అగ్నిసాక్షిగా జరుగుతాయి. కానీ ఇప్పుడు అగ్నికి బదులు వాననీటి సాక్షిగా జరుగుతున్నాయన్న మాట. ఏది ఏమైనా ఈ వెరైటీ పెళ్లిళ్ళు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ కొత్తజంటలకు మనం కూడా అభినందనలు చెబుదాం.
Read Also: Jacqueline Fernandez: నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బెయిల్ పొడగింపు..