ఆమె ఎంత అందంగా ఉంటుందో తెలుసా? ఆమెను చూసిన వారు కళ్ళు ఆర్పలేరు.. ఆమె అందం ముందు మోడల్స్, సినీ తారలు కూడా దిగదుడుపే. అయితే ఆమెను చూడడం, కామెంట్లు చేస్తే మాత్రం లాఠీతో పనిచెబుతుంది. ఇప్పటికే మీకు అర్థమయి వుంటుందనుకుంటా… ప్రపంచంలోనే అత్యంత అందమయిన పోలీస్ ఆమె. డయానా రామిరేజ్…. ఆమె రోడ్డమీద డ్యూటీ చేసిందంటే అక్కడ ట్రాఫిక్ జాం గ్యారంటీ.. ఆ ట్రాఫిక్ ని ఆమే కంట్రోల్ చేస్తుంది. డయానా రామిరేజ్ కొలంబియాలోని మెడెలిన్ వీధుల్లో గస్తీ తిరుగుతుంది. ఆమె లా అండ్ ఆర్డర్ ని కూడా బాగా కంట్రోల్ చేస్తుందనే పేరుంది.
Read Also: Twitter Blue Ticks: రాజకీయ నేతల పేరుతో నకిలీ ఖాతాలకు బ్లూటిక్స్.. ట్విట్టర్‌పై విమర్శల వర్షం
ఇంత అందమయిన యువతి, ధైర్యసాహసాలకు సంబంధించిన ఉద్యోగంలో ఆమె పనిచేస్తోంది. ఆమె పోలీసు అయితే ఆమెను ఆరాధించే వారు ఖచ్చితంగా అరెస్టు చేయడాన్ని పట్టించుకోరు! డయానా రామిరేజ్ తన పర్ఫెక్ట్ లుక్స్ కారణంగా సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ‘ప్రపంచంలోని అత్యంత అందమైన పోలీసు’గా ఆమె ఇప్పుడు ప్రచారం పొందుతోంది. కొలంబియాలోని మెడెలిన్‌కు చెందిన ఈ మహిళా పోలీసు అధికారికి భారీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ ఉంది – దాదాపు 4 లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
రామిరెజ్ ఇటీవల మెడెలిన్ వీధుల్లో గస్తీ తిరుగుతుంటుంది… అంతేనా.. ఆ నగరం అంటే అక్కడ విధులు నిర్వహించే పోలీసులకు సవాల్. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నగరాల్లో ఒకటిగా పిలువబడింది. కానీ ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ వున్నా ఆ ఉద్యోగం వదలడానికి తాను ససేమిరా అంటోంది. తనకున్న అందంతో మోడల్ గా రాణించవచ్చు.. కానీ తన ఒక రోజు ఉద్యోగాన్ని వదులుకునే ఉద్దేశం లేదని” రామిరేజ్ చెబుతోంది. పోలీసు ఉద్యోగం అంటే తనకెంతో ఇష్టమని, సవాళ్ళు వున్నా దానిని స్వీకరిస్తానంటోంది.
కెరీర్‌ని ఎంచుకునేందుకు జీవితం తనకు మరో అవకాశం ఇస్తే, మరోసారి పోలీసుగా ఎంచుకుంటానని ఆమె చెబుతోంది. దేవుడు తనకు మరోసారి కెరీర్ ఎంచుకునే అవకాశం ఇస్తే.. తాను మళ్ళీ పోలీసే కావాలని కోరుకుంటానంటోంది రామిరేజ్.అద్భుతమైన ఈ హాట్ అండ్ బ్యూటీఫుల్ పోలీసు తరచుగా ఇన్ స్టాగ్రాంలో పెట్టే వీడియోలు, ఫోటోల కోసం నాలుగులక్షలమంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. “ఇన్‌స్టాఫెస్ట్ అవార్డ్స్‌లో సంవత్సరపు ఉత్తమ పోలీస్ మిలటరీ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఆమె నామినేట్ చేయబడింది. ఇన్‌స్టాఫెస్ట్ అవార్డులు ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యే డిజిటల్ కంటెంట్‌ను సృష్టించే నిపుణులను గుర్తించడం లక్ష్యంగా చెబుతారు. పోలీస్ శాఖలో సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. ఆమె అందానికి సోషల్ మీడియా దాసోహం అంటోంది.
Read Also:Himachal Pradesh Elections: మెజారిటీ ఎమ్మెల్యే అభ్యర్థులంతా కోటీశ్వరులే.. ఫస్ట్ ప్లేస్ ఈ పార్టీదే