Reels On Busy Road: సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు యువతీ యువకులు చేస్తున్న విన్యాసాలు హద్దులు దాటి పోతున్నాయి. ఇక, ఇన్‌స్టాగ్రామ్ లో తమ రీల్స్ వైరల్ కావాలన్న అత్యుత్సాహంతో అసలేం చేస్తున్నారో కూడా వాళ్లు కూడా ఆలోచించడం లేదు. అయితే, తాజాగా ఓ యువకుడు నడి రోడ్డు మీద ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Plane Hijack: విమానం హైజాక్‌కు యత్నం.. ప్రయాణికుడి కాల్పుల్లో దుండగుడు హతం
అయితే, వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని మగడి రోడ్డులో ఈనెల 12వ తేదీన ఓ వ్యక్తి నడిరోడ్డుపై కుర్చీలో కూర్చొని టీ తాగుతూ రీల్స్ చేశాడు. ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేయగా.. అది వైరల్ అయింది. ఆ వీడియో కాస్త బెంగళూరు పోలీసుల కంట పడటంతో వెంటనే అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులు ఎక్స్ వేదికగా పోస్టు చేయగా.. దానికి ‘ప్రజల భద్రతకు విఘాతం కలిగించే ఇలాంటి స్టంట్‌లు చేస్తే మీకు ప్రశంసలకు బదులు.. జరిమానా విధిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు. ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Taking tea time to the traffic line will brew you a hefty fine, not fame !!! BEWARE BCP is watching you#police #awareness #weserveandprotect #stayvigilant pic.twitter.com/5A8aCJuuNc
— ಬೆಂಗಳೂರು ನಗರ ಪೊಲೀಸ್ BengaluruCityPolice (@BlrCityPolice) April 17, 2025