దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు, ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ముహుర్తాలు కూడా ఎక్కువే ఉండటంతో పెళ్లిళ్లు కూడా జోరుగానే జరుగుతున్నాయి. అయితే పెళ్ళికి పరిమిత సంఖ్యలోనే హాజరవ్వాలనే నిబంధనలు ఉన్న యథేచ్ఛగా బంధుమిత్రులు వేడుకలకు హాజరవుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లో కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఓ వివాహ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకోగానే కొందరు పరారయ్యారు. మరికొందరు అడ్డంగా దొరికిపోగా వారిని నడిరోడ్డుపై కప్పలా గెంతించారు. ఈ వింత శిక్ష సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.