సాధారణంగా అమ్మాయిలకు జంతు ప్రేమ ఎక్కువ ఉంటుంది. మూగ జీవాలు అంటే వారికి ప్రాణం.. ఎక్కువగా కుక్కలు, పిల్లులను ముద్దు చేస్తూ ఉంటారు. ఇక్కడివరకు అయితే ఓకే కానీ మరికొంతమంది అమ్మాయిలు ఒక అడుగు ముందుకేసి విష సర్పాలతో కూడా స్నేహం చేస్తారు. వాటిని ముద్దాడుతూ, పట్టుకుంటూ కనిపిస్తారు.. కొన్నిసార్లు అలాంటివి ఎంత ప్రమాదకరమో ఈ వీడియో తెలుపుతుంది. తాజాగా ఒక యువతి ఇలాంటి సాహసమే చేసింది.. కానీ చివరికి ఆ పాము నోట్లోనే చిక్కుకుపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ఒక పాములు పట్టే అతను కొండచిలువను చెందిన సర్పాన్ని చేతిలో పట్టుకొని రోడ్డు మీద అందరికి చూపిస్తున్నాడు.. ఆ సమయంలోనే ఒక యువతి అక్కడికి వచ్చింది. పాము ఎంత ముద్దుగా ఉందో అనుకుంటూ పాము తలపై ముద్దు పెట్టుకోవడానికి వంగింది. ఇంతలోనే టక్కున పాము నోరు తెరిచి ఆమె ముక్కును పట్టేసి లాగేసింది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న ఆ యువతి.. భయంతో కేకలు వేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. పాముతో పరాచకాలాడితే ఇలాగే ఉంటుంది అని కొందరు.. అది కచ్చితంగా మగ పామే అయ్యింటుంది అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
Bir ısırık alabilirmiyim abla 😬🙈 pic.twitter.com/G0iPZAqZiN
— güldür güldür (@guldurbakalim) December 10, 2021