దేశంలో దోశ అంటే ఇష్టపడని వ్యక్తులు ఉండరు. దోశల్లో ఎన్నో వెరైటీలు దొరుకుతుంటాయి. ఎక్కడ ఎంత టేస్ట్‌గా ఉండే అక్కడికి వెళ్లి టిఫెన్ చేస్తుంటారు. అయితే, సాదా, మసాలా, ఉల్లి తో పాటు కొన్ని టిఫెన్ సెంటర్లలో టోపీ దోశ అని, 70 ఎంఎం దోశ అని ఉంటాయి. అంతకు మించేలా అనే విధంగా ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో దోశ ఉన్నది. అది చిన్నా చితకా దోశ కాదు. సుమారు 10 అడుగుల పొడవైన దోశ. ఢిల్లీలోని బిందాపూర్ లోని శక్తిసాగర్ అనే రెస్టారెంట్‌లో తయారు చేస్తున్నారు. ఈ దోశను చాలా స్పెషల్‌గా తయారు చేస్తారట. దోశ ఖరీదు సింపుల్‌గా రూ. 1500. వీకెండ్స్‌లో ఈ 10 అడుగుల దోశను తినేందుకు కుటుంబంతో కలిసి వినియోగదారులు వస్తుంటారట.
Read: కేరళలో భారీగా పెరిగిన కేసులు… మరణాలు…
ఇటీవలే ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు. ఈ దోశను తిన్నవాళ్లకు రూ. 71 వేల ప్రైజ్‌మనీని అందజేస్తామని ప్రకటించారు. ఫ్యామిలీ మొత్తం కాకుండా 10 అడుగుల దోశను ఒక్కరే తినెయ్యాలి. అలా తిన్నవాళ్లకు రూ. 71 వేలు ప్రైజ్‌మనీ కింద ఇస్తామని చెప్పుకొచ్చారు హోటల్ యాజమాన్యం. అంతపెద్ద దోశను ఒక్కరే తినాలంటే సాధ్యం అవుతుందా? ఎమో తినేవాళ్లు ఉన్నారేమో…