Telangana Government: హైదరాబాద్‌లో మోడ్రన్ హాస్పిటల్స్ నిర్మాణ కాంట్రాక్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Government: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 3 అధునాతన ఆస్పత్రుల నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చింది. 2 వేల కోట్ల రూపాయల విలువైన ఈ కాంట్రాక్టులకు సంబంధించి లెటర్ ఆఫ్ అవార్డును అందజేసింది. సనత్ నగర్, ఎల్బీ నగర్, ఆల్వాల్ ఏరియాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టేందుకు 3 నిర్మాణ సంస్థలను ఎంపిక చేసింది. ఈ ఆస్పత్రులను టిమ్స్ అనే పేరుతో పిలుస్తారు.
IT Companies Q3 Performance: సంతోషంగా సెండాఫ్.. ఆనందంగా ఆహ్వానం..
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
టిమ్స్.. అంటే.. తెలంగాణ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని అర్థం. ఈ 3 టిమ్స్‌ను లార్సెన్ అండ్ టూబ్రో, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మరియు DEC ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలు నిర్మిస్తాయి. ఎల్బీ నగర్ టిమ్స్‌ను L&Tకి, సనత్ నగర్ టిమ్స్‌ను MEILకి, ఆల్వాల్ టిమ్స్‌ను DECకి అప్పగించారు. ఈ మేరకు L&Tకి 668 కోట్ల రూపాయలు, MEILకి 667 కోట్ల రూపాయలు, DECకి 669 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు.
L&T ఇప్పటికే వరంగల్‌లో 1,750 బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 33 అంతస్తుల ఈ నిర్మాణం పూర్తయితే తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద ఆస్పత్రుల్లో ఒకటిగా, దేశంలోని అత్యంత ఎత్తైన హాస్పిటల్‌గా నిలిచిపోతుందని చెబుతున్నారు. ఈ మూడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ గతేడాది ఏప్రిల్‌లో శంకుస్థాపన చేశారు.
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..