Election commission: రేపు జరగబోయే ఓట్ల లెక్కింపుకు అన్ని ఎర్పాట్లు చేసిన కేంద్ర ప్రభుత్వం కౌంటింగ్ కేంద్రాలు దగ్గర 144 సెక్షన్ అమలు చేసారు. మరి ముఖ్యంగా ఏపీ లో అయితే రికార్డ్ స్థాయి లో కేంద్ర బలగాలు ఏర్పాటు చేసారు. అవసరమైన చోట అదనపు బలగాలను కూడా మోహరించారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.. ఒకవేల ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా హెచ్చరించారు.