Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- కొంత కాలంగా హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న ఘటనలు
- ఎప్పుడు దాడి చేస్తారో.. ఎప్పుడు చంపుతారో తెలియదు
- యజమానులకు ఇస్తున్న పోలీసులు సూచనలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో జరుగుతున్న వరుస ఘటనలతో ఎవరిని పనిలో పెట్టుకోవాలన్నా దడుసుకునే పరిస్థితి వచ్చింది. డబ్బున్నవారికి పనిమనుషులు, డ్రైవర్లు, వాచ్మెన్లు, సెక్యూరిటీ గార్డ్స్ తప్పనిసరి. నేపాలీలు కాకపోతే మరొకరు. మరి పనిలో పెట్టుకునే వారిని నమ్మేదెలా..? వారి నుంచి ఎలాంటి వివరాలు, డాక్యుమెంట్లు తీసుకోవాలి..? స్థానిక పీఎస్‌లో సమాచారం ఇవ్వాలా..? ఇంతకూ పోలీసులు ఏం చెప్తున్నారు..?
నేరగాళ్లు ఎక్కడో ఉండరు.. వంట మనుషులు, పని మనుషులు, డ్రైవర్ల రూపంలో మన మధ్యే తిరుగుతుంటారు..!! యస్.. మీరు విన్నది కరెక్టే..!! ఎప్పుడు దాడి చేస్తారో.. ఎప్పుడు చంపుతారో తెలియదు. ముఖ్యంగా ఇతర దేశాలు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని గుడ్డిగా నమ్మితే అంతే సంగతులు..!! అలా వచ్చిన వారే దాడులు చేస్తున్నారు.. ఉన్నదంతా దోచుకుపోతున్నారు..! అంతేకాదు.. ఎదురు తిరిగినా.. డబ్బు, బంగారం లేదా ఇతర విలువైన వస్తువులు లభించకపోయినా.. చంపేందుకు సైతం వెనుకాడడం లేదు..!! హైదరాబాద్‌లో గత కొంత కాలంగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు హడలెత్తిస్తున్నాయి.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇటీవల నేపాలీల ఘటనలతో ప్రస్తుతం పనిలో ఉన్న నేపాల్ వాళ్లను ఉన్నఫలంగా తొలగించేస్తున్నారు కొందరు. చచ్చినా నేపాల్ వాళ్లను పనిలో పెట్టుకోవద్దు అనుకుంటున్నారు మరికొందరు. మరి నేపాల్ వాళ్లు కాకుండా ఇతర రాష్ట్రాల వారైతే ఓకేనా..? వాళ్లు కూడా ఇలాంటి క్రైమ్‌కి పాల్పడరని గ్యారెంటీ ఏంటి…? అలా అని తెలుగు వాళ్లను పెట్టుకుందామంటే ప్రతీ పండగకి సెలవు పెడతారు. మనం పండగ చేసుకుందామనుకున్నా… పనివాళ్లు లేక వర్క్ బర్డెన్ అవుతుంది. పోనీ పండగకు ఊరెళదాం అనుకుంటే.. ఇంట్లో పనోళ్లు, సెక్యురిటీ గార్డ్స్, డ్రైవర్లు ఉండరు.. మనకంటే ముందే ఊరికి వెళ్లిపోయి ఉంటారు. తప్పక వేరే రాష్ట్రాల వారిని పనిలో పెట్టుకోవాల్సి వస్తుంది.
అప్రమత్తమైన పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న బడాబాబులను అప్రమత్తం చేస్తున్నారు. మీరు ఎవరిని పనిలో పెట్టుకున్నా.. వాళ్ల నుంచి పూర్తి వివరాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వారి ఆధార్ కార్డ్‌తోపాటు మరో ఐడీ తీసుకోవాలంటున్నారు. వాళ్లు చెప్తున్న పేర్లు, ఐడీల్లో మ్యాచ్ అవుతున్నాయా లేదా సరిచూసుకోవాలంటున్నారు. వారి ఫొటోలు, వారు చెప్తున్న చిరునామా మ్యాచ్ అయ్యే ఐడీ ప్రూఫ్ తీసుకోవాలంటున్నారు. వారి బంధువులు లేదా స్నేహితులు కూడా అదే ప్రాంతంలో కానీ.. నగరంలో ఎక్కడైనా పనిచేస్తుంటే వాళ్ల వివరాలు, వారి ఐడీ ప్రూఫ్‌లు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ వివరాలు అన్నింటినీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఇచ్చి వెరిఫై చేయించుకోవాలని చెప్తున్నారు. వాళ్లు ఇచ్చిన వివరాలు సరైనవా కాదా అని చెక్ చేయడంతోపాటు… వాళ్ల పేర్ల మీద ఏదైనా క్రైమ్ హిస్టరీ ఉందా? అనేది తెలిసిపోతుందని సూచిస్తున్నారు పోలీసులు.
అపార్ట్మెంట్ అసోసియేషన్లు, గేటెడ్ కమ్యునిటీలు, సెక్యూరిటీ ఏజెన్సీలు, వాణిజ్య సంస్థలు… తమ వద్ద పనిచేసే నేపాలీలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వివరాలను మీ పరిధిలోని పోలీస్ స్టేషన్లో అందజేయాలని సూచిస్తున్నారు. వృద్ధులు, ఒంటరిగా ఉండే వాళ్లు పనివాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద కదలికలు గమనించినా.. పోలీసులకు కానీ డయల్ 100కి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. పోలీసులు కూడా ప్రత్యేకంగా వెరిఫికేషన్ డ్రైవ్, నైట్ పెట్రోలింగ్, కమ్యునిటీ పోలీసింగ్‌తో అవగాహన కల్పిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..