Non-Tech Sector Hiring: ఇటీవల ఐటీ ఇండస్ట్రీలో రిక్రూట్‌మెంట్లు మందగించిన నేపథ్యంలో నాన్ టెక్ సెక్టార్‌లో ఉద్యోగ నియామకాలు ఊపందుకోనున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొత్త సంవత్సరంలో హాస్పిటాలిటీ, టూరిజం, హెల్త్ కేర్, ఫార్మాస్యుటికల్స్, ఆటోమొబైల్, రెనివబుల్స్ తదితర వైట్ కాలర్ జాబుల హైరింగ్ పికప్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
2022 ఏప్రిల్‌లో వైట్ కాలర్ జాబ్ మార్కెట్‌లో నాన్ టెక్ సెక్టార్ కొలువుల వాటా 19 శాతం మాత్రమే ఉండగా డిసెంబర్ నాటికి 54 శాతానికి పెరిగింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెలికం, హెల్త్‌కేర్, ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కన్సల్టింగ్ తదితర రంగాలు టాప్‌లో నిలిచాయి. ప్రయాణ రంగం కోలుకోవటంతో హాస్పిటాలిటీ మరియు టూరిజం సెక్టార్లలో మరిన్ని ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
read more: Flipkart Fined: డెలివరీ చేయలేదు ఫోన్.. పడింది ఫైన్..
మరో వైపు.. ప్రభుత్వ రంగంలో మౌలిక వసతులపై వ్యయం పెరుగుతుండటంతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ కూడా కొలువులకు బాటలు వేయనుందని ఆదిత్య బిర్లా గ్రూప్ హెచ్‌ఆర్ డైరెక్టర్ మిశ్రా పేర్కొన్నారు. ఐటీ రంగంలో నియామకాలు 2023వ సంవత్సరంలో కూడా పెరిగే ఛాన్స్ లేదని అంటున్నారు.
చిన్న మరియు పెద్ద ఐటీ సర్వీసుల సంస్థల్లో రెండింటిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పారు. డిజిటలైజేషన్ శరవేగంగా సాగుతుండటంతో మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, పైథాన్, బిగ్ డేటా అనాలసిస్ వంటి అంశాల్లో నైపుణ్యం కలిగినవారికి మాత్రం రిక్రూటర్స్ పెద్ద పీట వేయనున్నారని అన్నారు.