I Love You Pepsi: సూపర్ డూపర్ హిట్ సినిమా కేజీఎఫ్‌తో దేశం నలుమూలలా అసంఖ్యాకంగా అభిమానులను సంపాదించుకున్న కన్నడ స్టార్.. యువ హీరో.. యశ్.. కొత్త సంవత్సరంలో కొత్త ప్రాజెక్టుకు సంతకం చేశాడు. ప్రాజెక్ట్ అంటే సినిమా కాదు. పెప్సీ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు. పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేయటం పట్ల యశ్ సంతోషం వ్యక్తం చేశాడు. లైఫ్‌లో ప్రతి మూమెంట్‌నీ ఎంజాయ్ చేయాలని, తద్వారా జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలనేది తన విధానమని పేర్కొన్నాడు.