Personal Data Safty: అరచేతిలోకి ప్రపంచాన్ని తీసుకొచ్చిన సెల్‌ఫోన్ వల్ల మన వ్యక్తిగత సమాచారం అంగడి సరుకుగా మారింది. మనకు తెలియకుండానే మన డేటా చోరీకి గురవుతోంది. దీనికి కారణం ఎవరు?. మనంతట మనమే మన పర్సనల్ డిటెయిల్స్‌ని ఆన్‌లైన్‌లో పెడుతున్నామా? (లేక) సైబర్ నేరగాళ్లు చాటుగా దొంగిలిస్తున్నారా? అంటే.. ఇద్దరూ కారణమే.
సోషల్ మీడియాను మరియు యాప్‌లను ఎక్కువగా వాడటం ద్వారా మనమే స్వతహాగా ఈ నేరాలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నామని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సైబర్ క్రైమ్‌లకు ఫుల్‌స్టాప్ పడాలంటే మనం ఆఫ్‌లైన్‌లో
ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో.. ఆన్‌లైన్‌లోనూ అంతే కేర్‌ఫుల్‌గా ఉండాలని సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్ అనిల్ రాచమల్లతో ఎన్‌టీవీ బిజినెస్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆ వీడియో.. మీకోసం..