మధ్య బంగాళాఖాతంలో బలపడుతున్న తీవ్ర వాయుగుండం… ఈరోజు సాయంత్రానికి తుఫానుగా మారుతుంది అని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా రేపు ఉదయం వరకు ఆ తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తోంది. రేపటికి ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముంది. ఉత్తరాంధ్ర అంతటా ఈరోజు రేపు ఓ మోస్తరు వర్షాలు చాలాచోట్ల పడతాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు ఒకటిరెండు చోట్ల పడే అవకాశముంది. గంటకు 45 నుంచి యాభై కిలోమీటర్లు అప్పుడప్పుడు అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. తీరం దగ్గరికి తుఫాను వచ్చే సరికి గాలి తీవ్రత మరింత పెరుగుతుంది….గ౦టకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అప్పుడప్పుడు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదు అని తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. తీవ్ర వాయుగుండం సైక్లోన్ గా మారాక తీరందాటే విషయమై స్పష్టత వస్తుంది అని పేర్కొన్నారు.