విశాఖలో కరోనా వార్డును తనిఖీ చేసిన విజయసాయిరెడ్డి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో కరోనా బాధితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్స్, వైరాలజీ ల్యాబ్, కేజీహెచ్ హాస్పిటల్‌ను వెస్‌ఆర్‌సీపీ ఎం.పి విజయసాయిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విశాఖలోని KGH హాస్పిటల్‌లో కరోనా బాధితులకు అందుతున్న సేవలను స్వయంగా తెలుసుకునేందుకు కరోనా వార్డులోకి వెళ్లారు. డాక్టర్లు వారించినా పి.పి.ఈ కిట్ ధరించి నేరుగా కరోనా రోగుల వద్దకు వెళ్లారు. ఒక్కొక్క బెడ్ వద్దకెళ్లి చికిత్స పొందుతున్న పేషంట్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లేనిపోని అనుమానాలు, భయాలు విడిచిపెట్టి ధైర్యంగా ఉండాలని పేషంట్లకు భరోసా కల్పించారు. రోగులకు అందిస్తున్న వైద్య చికిత్సల గురించి, ప్రస్తుతం వారి హెల్త్ కండీషన్ గురించి డాక్టర్లు విజయసాయిరెడ్డికి వివరించారు. ఆసుపత్రిలో మొత్తం ఎన్ని బెడ్స్ ఉన్నాయి…ఎంత మంది పేషంట్లకు చికిత్స అందిస్తున్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆక్సీజన్ నిల్వలు సరిపడినంత ఉందా అని అక్కడి సిబ్బందిని అడిగారు.
కరోనా పేషంట్ల బంధువులతో కూడా ఎంపి మాట్లాడారు. కరోనా బారిన పడిన ప్రజల ప్రాణాలు కాపాడ్డానికి సీఎం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని, ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తూ రోగులకు సరైన వైద్యం అందించేందుకు అహర్నిషలు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ ఎవరికి వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ వయసులో విజయసాయిరెడ్డి అంత రిస్కు తీసుకుని కరోనా వార్డులోపలికి వెళ్లి రోగులను పలకరించి వారికి ధైర్యం చెప్పడం చూసి రోగుల బంధువులు, ఆసుపత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు.
Also Read
తాజావార్తలు
-
418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
-
Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!
-
September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్‌లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
-
AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!