ఐపీఎల్ లో ఎప్పుడు టైటిల్ ఫెవరెట్స్ గా ఉండే రెండు జట్లు అయిన చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన పోటీలలో ముంబై 18 మ్యాచ్ లలో గెలవగా చెన్నై 12 గెలుపొందింది. ఇక 2018 లో చెన్నై జట్టు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ జట్టు పై ముంబై ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. కానీ గత ఐపీఎల్ సీజన్ లో చతికలబడి పోయిన చెన్నై జట్టు ఈ ఏడాది మాత్రం రెచ్చిపోతూ ఆడిన ఆరు మ్యాచ్ లలో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతుంది. కానీ ముంబై గత సీజన్ తో పోలిస్తే కొంత నెమ్మదించి ఆడిన ఆరులో మూడు మ్యాచ్ లలో మాత్రమే గెలిచింది. దాంతో ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. చూడాలి ఈరోజు జరగబోయే మ్యాచ్ లో చెన్నై వరుసగా తన ఆరో విజయాన్ని నమోదు చేస్తుందా.. లేదా ముంబై నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందా అనేది.