ఐపీఎల్ 2021 లో ఈరోజు డబుల్ హెడర్ సందర్బంగా రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదటిది సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. ఇక ఈ మ్యాచ్ ఓ టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో కేవలం ఒకేఒక విజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది హైదరాబాద్. దాంతో ఈ మ్యాచ్ నుండి కెప్టెన్ ను మార్చుకొని బరిలోకి దిగ్గుతుంది. చూడాలి మరి ఈ మార్పు హైదరాబాద్ కు ఎంతమేర ఉపయోగపడుతుంది అనేది.
రాజస్థాన్ : జోస్ బట్లర్, యషస్వి జైస్వాల్, సంజు సామ్సన్ (w/c), అనుజ్ రావత్, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ టెవాటియా, క్రిస్ మోరిస్, కార్తీక్ త్యాగి, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్
హైదరాబాద్ : జానీ బెయిర్‌స్టో (w), కేన్ విలియమ్సన్ (c), మనీష్ పాండే, అబ్దుల్ సమద్, మహ్మద్ నబీ, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్