ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు ఓపెనర్లలో ఫాఫ్ డు ప్లెసిస్ అర్ధశతకంతో అదరగొట్టగా రుతురాజ్ గైక్వాడ్ (33)తో రాణించాడు. అయితే గైక్వాడ్ ఔట్ అయిన తర్వాత రైనా, డు ప్లెసిస్ కలిసి ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బెంగళూరు స్పిన్నర్ హర్షల్ పటేల్ వరుస బంతుల్లో వారిని పెవిలియన్ చేర్చి చెన్నైని దెబ్బ కొట్టాడు. కానీ అదే హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లో రవీంద్ర జడేజా రెచ్చిపోయాడు. ఒక్కే ఓవర్లో 5 సిక్సులు ఒక్క ఫోర్ బాదాడు. ఈ క్రమంలోనే జడేజా (62) తన హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు. దాంతో చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఇక బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు, యుజ్వేంద్ర చాహల్ ఒక్క వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో బెంగళూరు 192 పరుగులు చేయాలి. చూడాలి మరి ఐపీఎల్ 2021 లో ఇప్పటివరకు ఓటమినెరగాని కోహ్లీ సేన ఏం చేస్తుంది అనేది.