రణబీర్ అనగానే మనకు బోలెడంత టాలెంట్, అందం, బ్లాక్ బస్టర్ మూవీస్ గుర్తుకు వస్తాయి. కానీ, వాటన్నిటి కంటే ఎక్కువగా ఆయన ఎఫైర్లు జ్ఞాపకం వస్తాయి. ముఖ్యంగా, దీపికా, కత్రీనాతో బీ-టౌన్ లవ్వర్ బాయ్ చేసిన రియల్ లైఫ్ రొమాన్స్ ఓ రేంజ్ లో ఫేమస్! ఇక ఇప్పుడు ఆలియాని ఆలింగనం చేసుకున్నాడు కపూర్ అబ్బాయి! త్వరలో పెళ్లి అని కూడా గట్టిగా ప్రచారం జరుగుతోంది. కానీ, ఇంతలో ఓ ఫేమస్ న్యూమరాలజిస్ట్ పెద్ద బాంబే పేల్చాడు…
35 ఏళ్ల అనుభవంతో జేసీ చౌదరి ముంబైలో చాలా ఫేమస్ న్యూమరాలజిస్ట్. ఆయన హై ప్రొఫైల్ ప్రిడిక్షన్స్ ని చాలా మంది నమ్ముతారు. అయితే, ఇక రేపో, మాపో రణబీర్, ఆలియా పెళ్లని దాదాపుగా అందరూ డిసైడ్ అయిపోయిన ప్రస్తుత తరుణంలో … సీనియర్ న్యూమరాలజిస్ట్ షాకింగ్ రహస్యాలు బయటపెట్టాడు. అసలు ఆలియా, రణబీర్ జోడీ ఒకరికి ఒకరు సూట్ కారని నిర్మొహమాటంగా తేల్చి చెప్పేశాడు. కాదుకూడదని ఆలియాని రణబీర్ తన ఆలిని చేసుకుంటే వారి బంధం అల్లాడాల్సిందేనంటున్నాడు సంఖ్య శాస్త్ర పండితుడు.
Read Also : ధనుష్ రికార్డ్ పై మహేశ్ కన్ను
జేసీ చౌదరీ చెబుతోన్న కారణాల ప్రకారం రణబీర్, ఆలియా పుట్టిన తేదీలు సహా వారి పేర్లు, పేర్లలో దాగున్న నంబర్స్, ఏవీ కంపాటిబుల్ కావటం లేదట. అందుకే, వారిద్దరు ఒక్కటైతే కూడా ఎక్కువ కాలం కలసి కొనసాగరని ఆయన నొక్కి చెబుతున్నాడు. డెస్టినీ నంబర్, సైకిక్ నంబర్, క్రోనోలాజికల్ ఏజ్ అంటూ అనేక సంఖ్య శాస్త్ర పదాలు వాడిన ఆయన తన ఆర్టికల్ లో మళ్లీ మళ్లీ రణ్, ఆలియా జంటని కలవద్దని హెచ్చరిస్తూ వచ్చాడు!
న్యూమరాలజీ వద్దంటోంది కాబట్టి రణబీర్, ఆలియా ఏం చేస్తారో మనకు తెలియదుగానీ… ఆన్ లైన్ లో నెటిజన్స్ అయితే రెండుగా విడిపోయారు. పెళ్లి చేసుకుని విడిపోవటం ఎందుకంటూ ‘వద్దంటోన్న’ వారు కొందరైతే… ప్రేమకి ఈ న్యూమరాలజీ పట్టింపులు ఏంటని అడుగుతున్న వారు కూడా కొందరున్నారు. నచ్చితే ఏడడుగులు నడవాల్సిందే అంటున్నారు…