‘Rx 100’తో యూత్ హార్ట్ త్రోబ్ గా మారింది పాయల్ రాజ్ పుత్. అందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించి కుర్రకారును కిర్రెక్కించింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ప్రాధాన్యం లేని పాత్రల ఎంపికతో స్టార్ స్టేటస్ అందుకేలేక పోయింది. ‘RX 100’ తర్వాత ‘వెంకీ మామ’ ‘డిస్కోరాజా’ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించినా అవి ఆమె కెరీర్ కు ఏమాత్రం హెల్ప్ అవలేదు. కొండకచో ఐటెమ్ సాంగ్స్ కూడా చేసింది. ఆ తర్వాత ‘అనగనగా ఓ అతిథి’ అనే వెబ్ మూవీతో ఓటీటీ వరల్డ్ లో ఎంటరైంది. అయినా అమ్మడిని సక్సెస్ పలకరించలేదు. తాజాగా తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ఆహా తీస్తున్న ‘త్రీ రోజెస్’ అనే వెబ్ సిరీస్ లో పాయల్ అవకాశం దక్కించుకుందట. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా మొదలైంది. ఇందులో కూడా పాయల్ సీరియస్ పాత్రనే పోషిస్తోందని సమాచారం. ఓ విధంగా చెప్పాలంటే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రనే చేస్తున్నట్లు టాక్. తెలుగులోనే కాదు పాయల్ తమిళంలో ఉదయనిధి స్టాలిన్ తో ‘ఏంజెల్’ అనే హారర్ థ్రిల్లర్ లో నటిస్తోంది. మరి రాబోయే కాలంలో పాయల్ స్టార్ స్టేటస్ అందుకుంటుందో లేదో చూడాలి.