తెలంగాణలో మోడల్ స్కూల్స్ అడ్మిషన్స్ కి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 6 వ తరగతి లో అడ్మిషన్స్ కోసం ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉండగా జూన్ 6 న ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుంది. జూన్ 14 న రిజల్ట్స్ ప్రకటించగా జూన్ 17 న స్కూల్ వారిగా సెలెక్టెడ్ జాబితా విడుదల చేస్తారు. అలాగే 7 నుండి 10 వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు కూడా 30 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు. అయితే వీరికి జూన్ 5న పరీక్ష ఉంటుంది. అయితే ఈ పరీక్షకు జనరల్ విద్యార్థులకు 150 రూపాయల ఫీజు… ఎస్సి,ఎస్టీ,బీసీ లకు 75 రూపాయల ఫీజు చెలించాలి.