ఢిల్లీ వేదికగా ఈరోజు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై జట్టు ముంబై ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఈ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్(4) నిరాశపరిచిన మరో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్(50), మొయిన్ అలీ(58) అర్ధశతకాలతో రాణించారు. దాంతో రెండో వికెట్ కు108 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పిన వీరిద్దరూ నాలుగు పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరుకున్నారు. ఆ తర్వాత రైనా(2) త్వరగా వెనుదిరిగిన మరో ఆటగాడు అంబటి రాయుడు మాత్రం చెలరేగిపోయాడు. చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచిన రాయుడు 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు. ఆ తర్వాత కూడా పరుగుల వరద పారించిన అంబటి 27 బంతుల్లో 72 పరుగులు చేసి అదరగొట్టడంతో చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది చెన్నై. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే ముంబై 20 ఓవర్లలో 219 పరుగులు చేయాలి. కానీ ఈ సీజన్ లో గత కొన్ని మ్యాచ్ లుగా ముంబై బ్యాటింగ్ ను చూస్తే ఈ టార్గెట్ ను ఛేదించడం కష్టం అనే చెప్పాలి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.