యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “మంచి రోజులొచ్చాయి”. ట్యాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌కు కూడా చక్కని స్పందన వచ్చింది. ‘ఏక్ మినీ కథ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు సంతోష్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ‘మహానుభావుడు’ లాంటి హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో వెన్నల కిషోర్, అజయ్ ఘోష్, సప్తగిరి, వివా హర్ష, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. “మంచి రోజులొచ్చాయి” సినిమాను వి సెల్యులాయిడ్ బ్యానర్ లో ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు.
Read Also : ‘అన్స్టాపబుల్’ బాలయ్య… స్టార్టింగ్ లోనే అల్లు అరవింద్ పై సెటైర్
ఇటీవల ఈ చిత్రం నుంచి “సోసోగా ” అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. అది ప్రేమికుల మనసును కొల్లగొట్టింది. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది. ట్రైలర్ లో ఎప్పటిలాగే మారుతీ మార్క్ స్పష్టంగా కన్పిస్తోంది. అందుకే ఈ ప్రేమకథకు సంబంధించిన ట్రైలర్ అంతగా ఆకట్టుకుంటోంది.